తమిళనాడులోని సోమవారం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో దిండిగల్ జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ కూతరు ప్రభంజనం సృష్టించింది. నందిని అనే అమ్మాయి అన్ని సబ్జెక్టుల్లో 600లకు 600 మార్కులు సాధించి సత్తా చాటింది. ఆమెకు తమిళ్, ఇంగ్లీష్, ఎకానామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ ఇలా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన నందిని భవిష్యత్తులో ఆడిటర్ కావాలనేదే తన లక్ష్యమని తెలిపింది.
అయితే ఈ 12వ తరగతి పరీక్షలకు తమిళనాడు వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 94.03 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు పాసయ్యారు. అమ్మాయిలకు 96.38 శాతం, అబ్బాయిలు 91.45 శాతంతో పాసయ్యారు. చాలామంది విద్యార్థులు తమిళ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, మ్యాథ్య్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 100 మార్కులు సాధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..