Ramoji Rao: రామోజీరావు మృతి తీరని లోటు.. చిరకాలం గుర్తుండిపోతారు.. ఆర్ఎస్ఎస్ సంతాపం..

|

Jun 08, 2024 | 12:55 PM

RSS Condolences to Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో రామోజీరావు.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Ramoji Rao: రామోజీరావు మృతి తీరని లోటు.. చిరకాలం గుర్తుండిపోతారు.. ఆర్ఎస్ఎస్ సంతాపం..
RSS Condolences to Ramoji Rao
Follow us on

RSS Condolences to Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో రామోజీరావు.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. రామోజీరావు భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు.. ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమై ఎంతోమంది నటులు, అగ్రశ్రేణి తారలుగా ఎదిగారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు.. ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెరపై అద్భుతాలు సృష్టించారు. కాగా.. రామోజీరావు మృతి పట్ల పత్రికా, సినీరంగంతోపాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు. అక్షరయోధుడు రామోజీరావు మృతి తీరని లోటు అంటూ నివాళులర్పిస్తున్నారు.

రామోజీరావు మృతి చాలా బాధాకరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పేర్కొంది.. రామోజీరావుకు నివాళులర్పించి.. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ సర్కార్యవ దత్తాత్రేయ హోసబాలే ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో షేర్ చేశారు.

‘‘ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మృతి.. ముఖ్యంగా జర్నలిజం, సినిమా రంగానికి తీరని లోటు. ఆయన ఎంచుకున్న రంగంలో ప్రత్యేక లక్షణాలు, అభ్యాసాలను జోడించడంలో మార్గదర్శకుడిగా అతని సహకారం చిరకాలం గుర్తుండిపోతుంది. రామోజీరావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.. మరణించిన ఆత్మకు సద్గతి ప్రసాదించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాము. ఓం శాంతిః’’ అంటూ ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..