కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మ్రోగనున్న ఎన్నికల నగారా.!

|

Feb 10, 2021 | 6:48 PM

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఎన్నికల నగారా మ్రోగబోతోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15..

కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన,  పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మ్రోగనున్న ఎన్నికల నగారా.!
Follow us on

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఎన్నికల నగారా మ్రోగబోతోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15 తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ దక్షిణాది పర్యటన ఫిబ్రవరి 15 తో ముగుస్తుంది. ఆ తరువాత నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

మొత్తంగా నాలుగు రాష్ట్రాలు, యుటి ఎన్నికల కోసం ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి ప్రారంభంలో వివరణాత్మక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి సంబంధించి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఆరు నుంచి ఎనిమిది దశల్లో నిర్వహిస్తారు. అస్సాంలో రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెప్పాయి. అయితే, ఈ రాష్ట్రాలన్నింటిలో ఒకే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

పది, పన్నెండవ తరగతులకు సిబిఎస్‌ఇ బోర్డు పరీక్ష ప్రారంభమయ్యే మే 1 లోపు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ముగించాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్లతో కూడిన ఎన్నికల కమిషన్ ప్రతినిధి బృందం.. సీనియర్ ఇసి అధికారులు ఆరు రోజులు అంటే, ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పర్యటిస్తారు.

పోల్-బౌండ్ రాష్ట్రాలకు సంబంధించి ఇసి అధికారుల చివరి పర్యటన ఇది. ఇప్పటికే డిప్యూటీ ఇసి స్థాయి తనిఖీ పూర్తయింది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల సంసిద్ధతను పరిశీలించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, యూనియన్ టెరిటరీ పోలింగ్ ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికల హీట్ తారాస్థాయిలో ఉంటుందన్నమాట.

తెలంగాణలో చర్చంతా కొత్త జెండా పైనే, షర్మిళ ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస.!