బిహార్‌లో వరదల బీభత్సం.. రైళ్ల రాకపోకలకు బ్రేకులు..

బిహార్‌లో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు వరదలు కూడా ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరదల దాటికి ఇప్పటికే పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ..

బిహార్‌లో వరదల బీభత్సం.. రైళ్ల రాకపోకలకు బ్రేకులు..

Edited By:

Updated on: Jul 24, 2020 | 6:29 PM

బిహార్‌లో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు వరదలు కూడా ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరదల దాటికి ఇప్పటికే పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో దర్భంగా- సమస్టిపూర్ మధ్య రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ వెల్లడించారు. సమస్టిపూర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా.. ఇప్పటికే పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

రాష్ట్రంలో వరదల దాటికి దాదాపు ఎనిమిది లక్షల మంది ఇబ్బందులు పడుతుండగా.. పద్నాలుగు వేల మంది వరకు పునరావాసాల కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. లోతట్టు  ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.