Cyclone Fengal: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ విధ్వంసం.. విద్యాసంస్థలకు సెలవులు

ఫెంగల్ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు , పుదుచ్చేరితో పాటు కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు రెడ్అలర్ట్‌ జారీ చేశారు. విల్లుపురంలో రిలీఫ్‌ క్యాంపులను సందర్శించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌.

Cyclone Fengal: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ విధ్వంసం.. విద్యాసంస్థలకు సెలవులు
Cyclone Fengal Updates

Updated on: Dec 01, 2024 | 9:30 PM

తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. తిరువణ్ణామలై .విలుపురం . కళ్లకురిచ్చి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ చేశారు. ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరో ఐదు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్ కొనసాగుతోంది. విల్లుపురంలో వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. రిలీఫ్‌ క్యాంప్‌ల్లో వరదబాధితులను పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులను పంపిణీ చేశారు.

కాంచీపురం జిల్లాల్లో డ్యాంలన్నీ నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా లోని నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడలూరులో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ఇళ్లు వరదనీటి లోనే ఉన్నాయి. బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోలకు కూడా ఇబ్బంది కలుగుతోంది . అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలను పునరుద్దరించారు.

పుదుచ్చేరిలో ఇంకా వందలాది ఇళ్లు నీటి లోనే మునిగిఉన్నాయి. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. రోడ్ల మీద వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద సహాయక చర్యల్లో సైన్యం కూడా రంగం లోకి దిగింది. 200 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. మలప్పురం , కొలికోడ్‌ , వయనాడు, కన్నూర్‌లో రెడ్అలర్ట్‌ జారీచేశారు. శబరిమలతో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శబరిమలలో వర్షం కారణంగా అయ్యప్పభక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సన్నిధానం, పంబా, నిలక్కల్‌లో వర్షాలు కురుస్తున్నాయి. శబరిమలలో దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గా భక్తులకు దర్శనం తొందరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..