Crime News: బీహార్ లో తెలంగాణ పోలీసులపై కాల్పులు.. నిందితుల నుంచి భారీగా నగదు స్వాధీనం..

|

Aug 15, 2022 | 6:29 AM

తెలుగు రాష్ట్రాలతో పాటు.. బీహార్, కోల్ కత్తా లో వాహనాల డీలర్ షిప్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లోని నవాదా జిల్లాలో నిందితులు కాల్పులకు

Crime News: బీహార్ లో తెలంగాణ పోలీసులపై కాల్పులు.. నిందితుల నుంచి భారీగా నగదు స్వాధీనం..
Police
Follow us on

Crime News: తెలుగు రాష్ట్రాలతో పాటు.. బీహార్, కోల్ కత్తా లో వాహనాల డీలర్ షిప్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లోని నవాదా జిల్లాలో నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈకాల్పుల నుంచి తప్పించుకుని.. సురక్షితంగా బయటపడిన పోలీసులు.. చివరికి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.1కోటి23లక్షల రూపాయలతో పాటు 2కార్లు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బైక్ లు, కార్లు విక్రయిస్తామని, వాహనాల డీలర్ షిప్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఏపీ, తెలంగాణలో వందలాది మందిని మోసగించిన నిందితులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు, నవాదా పోలీసుల సహాయంతో భవానీబిఘా గ్రామానికి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున నిందితులను పట్టుకునేందుకు సిద్ధం కాగా.. అది గమనించిన ప్రధాన నిందితుడు మిథిలేశ్ ప్రసాద్.. పోలీసులపై కాల్పులు జరిపి.. తప్పించుకుని పారిపోయాడు. అనంతరం భూతలిరామ్, మహేష్ కుమార్, సురేంద్రమహతో, జితేంద్రకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1కోటి 23 లక్షల రూపాయల నగదు, 2 కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు ఏపీ, తెలంగాణతో పాటు పట్నా, కోల్ కత్తా నగరాల్లో పలువురిని వాహర డీలర్ షిప్ పేరుతో మోసగించినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన ఓ వ్యాపారి కార్ల డీలర్ షిప్ కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి.. ఓ నకిలీ వెబ్ సైట్ లో డీలర్ షిప్ కావాలంటూ వివరాలు ఇవ్వడంతో.. నిజామాబాద్ లో డీలర్ షిప్ ఓకే అయ్యిందంటూ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2,65000 చెల్లించాలంటూ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ పంపించారు. అది నిజమని నమ్మిన బాధితుడు జులై 7వ తేదీన రిజిస్ట్రేషన్ ఫీజు కోసం నగదు చెల్లించాడు. అలా పలు దఫాలుగా మొత్తం రూ.28,58,500ను నిందితుడి నుంచి దోచుకున్నారు. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ ఫోన్లు చేస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితుడు జులై 16వ తేదీన సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం నవాదా జిల్లా భవానీబిఘా వెళ్లగా.. సైబర్ నేరగాళ్లు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈప్రమాదంలో పోలీసులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..