Gold Smuggling: ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్.. 6 కోట్ల బంగారాన్ని ఎక్కడ దాడి తీసుకెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు..!

|

Nov 19, 2021 | 6:55 PM

Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Gold Smuggling: ఎయిరిండియా ఉద్యోగుల అరెస్ట్.. 6 కోట్ల బంగారాన్ని ఎక్కడ దాడి తీసుకెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు..!
Gold
Follow us on

Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ కేసులో ముగ్గురు ఎయిరిండియా ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల విమానంలో సీటు కింద దాచి విదేశాల నుంచి కేజీన్నర బంగారాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌కు తీసుకువచ్చారు. అది పసిగట్టిన కస్టమ్స్ అధికారులు.. ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. సీట్ కింద దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ ముగ్గురు ఉద్యోగులు ఎయిర్‌ ఇండియాలో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నారు.

స్మగ్లర్లు నేరుగా తీసుకువస్తే పట్టుబడుతున్న నేపథ్యంలో.. ఇలా ఉద్యోగులను తమవైపునకు లాక్కుని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతకు ముందు కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లు తెలుసుకున్నారు అధికారులు. అరెస్ట్ చేసిన ముగ్గురు ఉద్యోగులను కస్టమ్స్ అధికారులు.. జైపూర్‌లోని ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు. వీరు ఇప్పటి వరకు రూ. 6 కోట్లకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు తేలింది. న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Also read:

Nayanthara: మరో హారర్ థ్రిల్లర్ జోనర్‏లో నయన్ కొత్త సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..

Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..