చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గతవారంలో తీవ్ర అలజడి రేపిన విషయం తెలిసిందే. భద్రతా దళాలను మావోయిస్టులు ట్రాప్ చేసి 24 మంది జవాన్ల ప్రాణాలను తీశారు. మావోయిస్టుల ఈ అరాచకం వెనుక మావోయిస్టు గెరిల్లా దళ కమాండర్ మడ్వి హిడ్మా ప్రముఖ పాత్ర వహించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతనిని హిట్ లిస్ట్ లో చేర్చాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం మడ్వి హిడ్మాను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో హిడ్మా త్వరలో చరిత్రలో కలిసిపోతాడు అంటూ సీఆర్ఫీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను కూకటివేళ్లతో సహా ఏకిపారేసేందుకు పగడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నామనీ, దానిని ఆచరణలోకి తీసుకు వచ్చామనీ అయన చెబుతున్నారు.
సీఆర్ఫీఎఫ్ డైరెక్టర్ జనరల్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. మావోయిస్టులు ఇప్పటికే ఉనికిని కోల్పోయారని అయన అభిప్రాయపడ్డారు. ‘‘మా వాళ్లు మారుమూల అటవీ ప్రాంతాల్లోనూ శిబిరాలను ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రాంతాలకూ చొచ్చుకుపోతారు… ఇక మావోయిస్టులు తప్పించుకోవడం అసాధ్యం’’ అని ఆయన చెప్పారు. ఇక బీజాపూర్ ఎంకౌంటర్ లో భద్రతాదళాకు ఎక్కువ నష్టం వాటిల్లిన మాట సరికాదన్నారు. మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం భారీగా ఉందని అయన తెలిపారు. మావోయిస్టుల ఉచ్చులో భద్రతా బలగాలు చిక్కుకున్నాయని జరుగుతున్నా ప్రచారాన్ని కూడా అయన ఖండించారు.
‘’వాళ్లు (నక్సల్స్) గోడుచాటున దాక్కుని పోరాటం చేస్తున్నారు.. ప్రస్తుతం వారిని ఓ చిన్న ప్రాంతానికే పరిమితం చేశారు.. వాళ్లను అంతం చేయడం లేదా పారిపోయేలా చేయడం ఏదో ఒకటి జరుగుతుంది.. ఒకప్పుడు 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచుకున్న వాళ్లు.. ప్రస్తుతం 20 చదరపు కిలోమీటర్లకే పరిమితమయ్యారు’’ అని సీఆర్ఫీఎఫ్ డీజీ అన్నారు.
ఆ ప్రాంతాల్లో మావోయిస్టులను ఏడాదిలోపే పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో హిడ్మా విషయం మాట్లాడుతూ నూరుశాతం కచ్చితం అని చెప్పలేను కానీ, ఇటువంటి వాళ్ళు చరిత్రలో కలిసిపోవడం ఖాయం అన్నారు.
మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం… ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌ల రద్దు