Cowin Server: కోవిన్ సర్వర్ డౌన్.. ప్రారంభం కాగానే క్రాష్ అయిన వెబ్‏సైట్.. రిజిస్ట్రేషన్‏కు అడ్డంకులు..

|

Apr 29, 2021 | 8:27 AM

Cowin Server Facing Issues: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన

Cowin Server:  కోవిన్ సర్వర్ డౌన్.. ప్రారంభం కాగానే క్రాష్ అయిన వెబ్‏సైట్.. రిజిస్ట్రేషన్‏కు అడ్డంకులు..
Cowin Server
Follow us on

Cowin Server Facing Issues: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే.. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కు అనుమతించగా.. రద్దీ కారణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్ పోర్టల్ క్రాష్ అయ్యింది.

ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్ లోనూ ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కోవిన్ సైట్ నిమిషానికి దాదాపు 27 లక్షల హిట్లు వచ్చాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రజలంతా ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రయత్నించిన కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని తెలిపార. రాష్ట్రాలు, ప్రైవేట్ టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అయితే కొద్దిగంటల తర్వాత కోవిన్‌ పోర్టల్‌పై లోడ్‌ తగ్గిన అనంతరం ప్రజలు తమపేరు నమోదు చేసుకోగలిగారు. అయినప్పటికీ వారి ప్రాంతం ఆధారంగా స్లాట్‌ బుకింగ్‌కు మాత్రం అవకాశం ఇంకా ఇవ్వలేదు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రాష్ట్రా, కేంద్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగానే అపాయింట్ మెంట్ లు లభిస్తాయి. టీకాలు అందుబాటులో ఉండి. మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్రాల ఆధారంగానే అపాయింట్ మెంట్ ఇవ్వనున్నారు. ఆర్టర్లు పెట్టినా సరే. పలు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు టీకాలు అందడానికి కాస్త సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక టీకాలు అందకపోతే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగే అవకాశం లేదని పలు రాష్ట్రాలు తెలుపాయి. ఇక కోవిన్ సర్వర్ లో కలిగిన అసౌకర్యానికి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసారు.. కోవిన్‌ పోర్టల్‌ స్పందించడం లేదని కొందరు, సైట్‌ క్రాష్‌ అయ్యిందని మరికొందరు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. అయితే కోవిన్‌ పోర్టల్‌ పనిచేస్తోందని, సాయంత్రం 4 గంటలకు సైట్‌లో వచ్చిన చిన్న లోపం పరిష్కారం అయ్యిందని ఆరోగ్య సేతు ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి సాయంత్రం 4.35 గంటలకు ఒక ట్వీట్‌ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు వ్యాక్సినేషన్‌ సెషన్లను షెడ్యూల్‌ చేసిన తర్వాత 18+ వారికి వ్యాక్సిన్‌ అపాయింట్‌మెంట్‌లు సాధ్యమవుతాయని సాయం త్రం 4.54 గంటలకు ఆరోగ్యసేతు యాప్‌ నుంచి ట్వీట్‌ వచ్చింది.

ఇక ఈ ఫిర్యాదులపై ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి స్పధించింది. రిజిస్ట్రేషన్లు సాఫీగానే జరిగాయని తెలిపింది. మొదటి రోజు 4 నుంచి 7 గంటల మధ్యలో దాదాపు 80 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించింది. ప్రారంభంకాగానే నిమిషానికి 27 లక్షల హిట్లు వచ్చాయని.. ఆ తర్వాత ప్రతి సెకనుకు 55 వేల హిట్లు వచ్చాయని తెలిపింది. కోవిన్ పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదని… ప్రస్తుతం సరిగానే పనిచేస్తుందని వివరణ ఇచ్చింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ల వివరాలను సర్వర్ లో పెడతామని తెలిపింది.

Also Read: కరోనా అంటే భయం వేయడం లేదు.. కానీ ఈ ఫ్యాన్ చూస్తుంటే భయమేస్తుంది.. దయచేసి మార్చండి.. కోవిడ్ రోగి రిక్వెస్ట్..

Horoscope Today: ఈరాశివారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. రాశి ఫలాలు..