ఇండియాలో 60 ఏళ్ళు పైబడినవారికి, 45 ఏళ్ళ వయస్సులో వివిధ వ్యాధులకు లేదా రుగ్మతలకు గురైనవారికి మార్చి 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో 250 రూపాయలకు ఈ టీకామందులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితమని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. కాగా 45-59 ఏళ్ళ మధ్య వయస్సు వారిలో వివిధ రోగాలకు గురైనవారు ఉన్నప్పుడు ఆయా రుగ్మతల జాబితాను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 20 వ్యాధులు లేదా శారీరక రుగ్మతల వివరాలు ఇలా ఉన్నాయి.
Presence of any of 20 criteria (attached with tweet) will be prioritized for vaccination; it includes heart failure with hospital admission in past one yr, kidney/liver/hematopoietic stem cell transplant recipient/on waitlist, decompensated cirrhosis, end-state kidney disease:GoI pic.twitter.com/LOB9AmjkPh
— ANI (@ANI) February 27, 2021
ఇలా ఉండగా ప్రైవేటు ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. సీజీహెచ్ ఎస్ కింద 600 కి పైగా 600 కి పైగా హాస్పిటల్స్, ఆయుష్మాన్ పీఎం జే కింద 10 వేలకు పైగా ప్రైవేటు హాస్పిటల్స్ ను కేంద్రం గుర్తించింది. వీటిని కోవిద్ ఇమ్యునైజేషన్ సెంటర్లుగా వ్యవహరించనున్నారు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారని కేంద్రం వెల్లడించింది. ఆరోగ్య, నేషనల్ హెల్త్ అథారిటీ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్స్ లో ఈ ప్రైవేటు హాస్పిటల్స్ జాబితాను అప్ లోడ్ చేసినట్టు తెలిపింది. ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ సౌలభ్యం కూడా ఉందని, దీని వల్ల ప్రజలు తాము ఎంచుకున్న సెంటర్లకు లేదా ఆస్పత్రులకు వెళ్ళవచ్చునని వివరించింది. ఇలా ఉండగా 45 ఏళ్ళవారిలో జబ్బులకు గురైనవారు తమ మెడికల్ రిపోర్టులను వెంట తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం దేశ వ్యాప్తంగా పలు సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్రాలతో టచ్ లో ఉండాలని, ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి తమతో సమన్వయము చేసుకోవలసి ఉంటుందని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా యుధ్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇక 60 ఏళ్ల వారు కూడా తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన హెల్త్ రికార్డులను వెంట తీసుకువెళ్లడం మంచిదని ఆరోగ్య శాఖ వర్గాలు సూచనప్రాయంగా పేర్కొన్నాయి. దీనివల్ల వ్యాక్సిన్ ఇచ్ఛేవారికీ కూడా వారి ఆరోగ్య సమస్యలు తెలుస్తాయని పేర్కొంది.
Read More:
‘ముందుంది పెద్ద ముప్పు, ఇది ట్రైలర్ మాత్రమే !’ ముకేశ్ అంబానీకి జైష్-ఉల్-హింద్ బెదిరింపు మెసేజ్.
National Science Day: నేడు నేషనల్ సైన్స్ డే.. ఎందుకు.. ఎప్పటినుంచి నిర్వహిస్తున్నారో తెలుసా..?