Vaccine Certificates: కేంద్ర మంత్రుల పేర్లతో వ్యాక్సిన్ సర్టిఫికేట్లు.. కావాలనే చేశారంటోన్న అధికారులు.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు

|

Dec 18, 2021 | 4:58 PM

ఈ సర్టిఫికెట్లలో కొందరు కేంద్రమంత్రులు -- అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి పేర్లతో రూపొందించారు.

Vaccine Certificates: కేంద్ర మంత్రుల పేర్లతో వ్యాక్సిన్ సర్టిఫికేట్లు.. కావాలనే చేశారంటోన్న అధికారులు.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు
Covid Vaccine
Follow us on

Covid Vaccine Certificates: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో “అమిత్ షా”, “పీయుష్ గోయల్”, “నితిన్ గడ్కరీ” పేర్లతో కూడిన కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. ఈమేరకు విచారణకు ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. “అమిత్ షా”, “ఓం బిర్లా”, “నితిన్ గడ్కరీ”, “పీయూష్ గోయల్” పేరిట కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లను ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని తఖా తహసీల్‌లోని ఆరోగ్య సంరక్షణ కేంద్రం జారీ చేసింది. అయితే వీటిపై అనుమానలు వెల్లడిస్తూ ఒక అధికారి ఈ సర్టిఫికేట్లను నకిలీ అని పేర్కొన్నాడు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు.

ఈ సర్టిఫికెట్లలో కొందరు కేంద్రమంత్రులు — అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి పేర్లతో సర్టిఫికెట్లను రూపొందించారు. “నకిలీ” వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో అమిత్ షా వయస్సు 33 సంవత్సరాలు అని ఉండగా, నితిన్ గడ్కరీ వయస్సు కూడా 30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. పీయూష్ గోయల్ వయస్సు 37 సంవత్సరాలు, ఓం బిర్లా వయస్సు 26 సంవత్సరాలుగా పేర్కొన్నారు.

వీరంతా డిసెంబరు 12న ఇటావాలోని సర్సైనవర్ సీహెచ్‌సీ 1లో మొదటి డోస్‌ టీకాలు వేసినట్లు ఈ సర్టిఫికేట్‌లు చూపిస్తున్నాయి. రెండవ డోస్ కోసం మార్చి 5, 2022, ఏప్రిల్ 3, 2022 మధ్య నిర్ణయించారు. అంతేకాకుండా, ఈ సర్టిఫికేట్ల కాపీలు బయటకు వచ్చిన తర్వాత, సర్టిఫికేట్‌లో పేర్కొన్న హెల్త్‌కేర్ సెంటర్‌లో అలాంటి వ్యాక్సిన్ ఏదీ ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయంపై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సీ) ఇన్‌ఛార్జ్‌ని అడిగినప్పుడు, “డిసెంబర్ 12 న మా ఐడీ హ్యాక్ అయింది. ఈ ఐడీని క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మేం లేఖ రాశాం” అని పేర్కొన్నారు.

ఎవరో కుట్ర పన్నారని సీఎంవో డాక్టర్ భగవాన్ దాస్ భిరోరియా ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్ర మంత్రుల పేర్లను వాడారని, ఇందుకోసం ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని.. ఈ మోసాన్ని త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు.

Also Read: Mother Marriage: తల్లి రెండో పెళ్లిని సోషల్ మీడియాలో పంచుకున్న కుమార్తె.. వైరల్‎గా మారిన వీడియో.

Leander Paes Exclusive Interview: ‘సేవే నా లక్ష్యం.. అది ఆటలోనైనా, దేశ రాజకీల్లోనైనా.. నిజయితీకి నిలువటద్దంలా ఉంటా’: లియాండర్ పేస్