COVID Tests: దేశంలో కరోనా రెండో వేవ్ అధిగమించడానికి, మూడు టీ (T) లకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతూ వస్తున్నారు. అవి టెస్ట్, ట్రేసింగ్ అలాగే ట్రాకింగ్. ఈ నేపధ్యంలో దేశంలో టెస్టుల సంఖ్య పెంచాయి ప్రభుత్వాలు. దీంతో 20 లక్షల 55 వేల 10 మందికి కరోనా పరీక్ష బుధవారం జరిగింది. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో పరీక్షలు జరగడం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32 కోట్ల 23 లక్షల 56 వేల 187 నమూనా పరీక్షలు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు మంగళవారం దేశంలో రికార్డు స్థాయిలో 20 లక్షల 8 వేల 296 కరోనా పరీక్షలు జరిగాయి. అదే సమయంలో, మే 11 న 19 లక్షల 83 వేల 804 పరీక్షలు జరిగాయి.
జూన్ నాటికి 4.5 మిలియన్ పరీక్షలు లక్ష్యం:
ఈ నెల చివరి నాటికి 2.5 మిలియన్ పరీక్షలు, జూన్ చివరి నాటికి 45 లక్షలు పరీక్షలు చేయడమే మా లక్ష్యమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. ఫిబ్రవరి మధ్య నుంచి భారతదేశంలో కరోనా పరిశోధనల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, 12 వారాల్లో 2.3 రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.
జనాభా ప్రకారం, ఢిల్లీలో ఉత్తమ నమూనా పరీక్షలు జరిగాయి. బెంగాల్ వెనుకబడినట్టు చెబుతున్నారు. ఢిల్లీలో అత్యధికంగా 22 మిలియన్ల జనాభాలో సుమారు 18 మిలియన్ పరీక్షలు జరిగాయి. అంటే, పరీక్ష నిష్పత్తి 81.81%. దీని తరువాత కర్ణాటక 6.6 కోట్ల జనాభాలో 28 మిలియన్ పరీక్షలు జరిగాయి. ఇక్కడ నమూనా రేటు 42.42%గా నమోదు అయింది. మరోవైపు, దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల గురించి చెప్పాల్సి వస్తే 22.5 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో 4.6 కోట్ల పరీక్షలు జరిగాయి, అంటే ఇక్కడ 20.44% సగటున పరీక్షలు జరిగాయి. అదే మహారాష్ట్ర విషయానికి వస్తే ఈ నిష్పత్తి 26.22% గా ఉంది.
ఇక రాష్ట్రాల పరంగా తీసుకుంటే.. తెలుగు రాష్ట్రాల విషయంలో.. తెలంగాణలో 1.4 కోట్ల టెస్టులు, ఆంధ్రప్రదేశ్ లో 1.8 కోట్ల కరోనా పరీక్షలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ గరిష్టంగా 4.6 కోట్ల పరీక్షలను రికార్డు చేసింది. అదే సమయంలో, రెండవ కరోనా పరీక్షల్లో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 3.2 కోట్ల నమూనాలను తీసుకున్నారు. బీహార్, కర్ణాటకలలో ఇది 2.8 కోట్లుగా ఉంది. ఇక మధ్యప్రదేశ్‌లో ఈ సంఖ్య 89.9 లక్షలు.
రాష్ట్రాల వారీగా ఇప్పటి వరకూ జరిపిన కరోనా పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి..
Bharat Biotech: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. గుజరాత్‌లోనూ కోవాక్సిన్ టీకా ఉత్పత్తి