
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిన్ పోర్టల్ లో సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన కొవోవాక్స్ అనే బూస్టర్ డోసును అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే కొన్నిరోజుల్లోనే ఈ బూస్టర్ డోసు ఆ పోర్టల్ లో లభించనుందని పేర్కొన్నారు. ఒక కొవోవాక్స్ బూస్టర్ డోస్ ధర సుమారు రూ.225 ఉంటుందని వెల్లడించారు. సిరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డైరెక్టర్ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. కొవోవాక్స్ ను DCGI, WHO, అలాగే USFDA లు ఆమోదించాయని.. దీనిని వయోజనులకు బూస్టర్ డోసుగా కొవిన్ పోర్టల్ అందుబాటులో ఉంచాలని కోరాడు.
అయితే దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇంతకుముందు కొవిషీల్డ్ లేదా కోవాక్సిన్ వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్నవారికి ఈ కొవోవాక్స్ బూస్టర్ డోస్ వేయనున్నారు. ఈ కొవోవాక్స్ ను నోవావాక్స్ అనే టీకా సాంకేతికత ద్వారా అభివృద్ధి చేశారు. దీన్ని యూరోపియన్ మెడిసన్స్ ఏజేన్సీ ఆమోదించింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 డిసెంబర్ 17న అత్యవసర వినియోగా జాబితాలోక కూడా ఈ కోవావాక్స్ ను చేర్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..