కర్ణాటకలో కోవిద్ విలయం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 48,296 కోవిడ్ కేసులు నమోదు కాగా 217 మంది మరణించారు. రాజధాని బెంగుళూరులో ఒక్క రోజులో 26,756 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని కర్ణాటక హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. 14 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ పరిస్థితి మెరుగు పడలేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. నగరంలో 2.5 లక్షల యాక్టివ్ కేసులున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర పాజిటివిటీ రేటు 25 శాతానికి పెరగడంఆందోళనకు గురి చేస్తోందన్నారు. మంగళవారం రాత్రి నుంచిరాష్టంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. కాగా-వ్యాక్సిన్ కొరత కారణంగా 18 ఏళ్ళు పైబడినవారికి రేపటినుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం లేదని ఆరోగ్య శాఖమంత్రి సుధాకర్తెలిపారు. ఈ కారణంగా ప్రజలు వ్యాక్సిన్ సెంటర్ల వద్దకో, హాస్పిటల్స్ వద్దకు పరుగులు తీయరాదని ఆయన కోరారు. టీకామందు వచ్చిన వెంటనే తెలియజేస్తామన్నారు. అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
గతంలో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు చాలావరకు అదుపులోకి రాగా ఈసారి మాత్రం రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది . ప్రజల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు,. షాపింగ్ మాల్స్. సినీ థియేటర్లు, మార్కెట్లు అన్నీ మూసివేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
కోవిడ్ పై పోరులో సహకరిస్తాం, ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లేఖ , ‘సానుభూతి వెల్లువ’