Covid 4th Wave: కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చేస్తోంది.. వణికిస్తున్న కొత్త కొత్త వేరియంట్లు..!

|

Mar 18, 2022 | 11:34 AM

Covid 4th Wave: గత రెండేళ్లకుపైగా కరోనాతో పోరాడుతున్నాము. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, ఇతర ఆంక్షల కారణంగా కరోనా కట్టడికి మంచి ఫలితాలు ఇచ్చాయనే చెప్పాలి. ఇక థర్డ్‌..

Covid 4th Wave: కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చేస్తోంది.. వణికిస్తున్న కొత్త కొత్త వేరియంట్లు..!
Follow us on

Covid 4th Wave: గత రెండేళ్లకుపైగా కరోనాతో పోరాడుతున్నాము. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, ఇతర ఆంక్షల కారణంగా కరోనా కట్టడికి మంచి ఫలితాలు ఇచ్చాయనే చెప్పాలి. ఇక థర్డ్‌వేవ్‌ ముగిసింది. ఇప్పుడు ఫోర్త్‌వేవ్‌ రాబోతోంది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా.. నాలుగో దశ వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఫోర్త్‌ వేవ్‌ జూన్‌ నెలలో వచ్చే అవకాశాలున్నాయని ఇటీవల నిపుణులు పేర్కొన్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్లక్ష్యం చేయరాదని, ఫోర్త్‌వేవ్‌ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్త అవుతోంది. ఇక ప్రపంచానికి ఇప్పుడు కొత్త స్టెల్త్‌ బీఏ2 వేరియంట్‌ ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనాలో ఈ కొత్త వేరియంట్‌ బయటపడింది. దీంతో అక్కడ రోజురోజుకు పాజిటివ్‌ కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది చైనా ప్రభుత్వం.

ఇక దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేసుల పెరుగుదల, జీనోమ్‌ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపడుతున్నారు. స్టెల్త్‌ ఒమిక్రాన్‌ అత్యధిక ప్రమాదకరమైన వేరియంట్‌గా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒమిక్రాన్‌ కంటే వేగంగా వ్యాపిపిస్తుందని గుర్తించారు. స్టెల్త్‌ ఒమిక్రాన్‌కు సంబంధించి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఈ వేరియంట్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్‌ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేవు. దీంతో గుర్తింపు కూడా కష్టంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌లో మరో ప్రమాదకరమైన వేరియంట్‌:

కరోనా తర్వాత దాని వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని సైతం వణికించింది. ఇప్పుడు స్టెల్త్ బీఏ.2 వేరియంట్‌గా విజృంభిస్తోంది. ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మరో వేరియంట్‌ బయటపడింది. ఒరిజినల్ ఓమిక్రాన్, స్టెల్త్ BA.2 వేరియంట్ రెండూ ఒకే సారి సోకిన ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించారు. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌లు బీఏ.1, బీఏ.2 ను వేరియంట్లు ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి వేరియంట్ ఇంత వరకూ ప్రపంచంలో కనిపించలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఆగ్నేయాసియా, చైనా, యూరప్‌ల నుంచి మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నందున మారిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే ఈ విమాన సర్వీసులను పునరుద్దరించాలనే ఆదేశాలను రద్దు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ ధర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపించింది. ఆ వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఫోర్త్‌ వేవ్‌ వస్తుండటంతో ఆందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి:

Coronavirus: చైనాలో పెరుగుతోన్న కరోనా కేసులు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి.. నిపుణుల మాటేంటి.?

India Coronavirus Updates: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు