భారత్‌కి అందిన 100 వెంటిలేటర్లు

| Edited By:

Jun 16, 2020 | 5:58 PM

హామీ ఇచ్చినట్లుగానే 100 వెంటిలేటర్లను భారత్‌కు పంపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం ఎయిర్‌ ఇండియా విమానం ద్వారా భారత్‌కి వెంటిలేటర్లు చేరాయి.

భారత్‌కి అందిన 100 వెంటిలేటర్లు
Follow us on

హామీ ఇచ్చినట్లుగానే 100 వెంటిలేటర్లను భారత్‌కు పంపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం ఎయిర్‌ ఇండియా విమానం ద్వారా భారత్‌కి వెంటిలేటర్లు చేరాయి. కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ అభివృద్ది సంస్థ ద్వారా భారత్‌కి 200 వెంటిలేటర్లు అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందులో భాగంగా మొదట 100 వెంటిలేటర్లను భారత్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు అందించారు. ఈ విషయాన్ని భారత్‌లో ఉన్న యూఎస్ విదేశాంగ మంత్రి కెన్నత్ జస్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టర్ మాట్లాడుతూ.. ”ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. ప్రపంచ దేశాల భాగస్వామ్యం, సహకారంతోనే ఆరోగ్యంపై ప్రజలకు హామీ ఇవ్వగలం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read This Story Also: మహేష్-విజయ్‌ మల్టీస్టారర్‌ అందుకే ఆగిపోయిందట