లాక్ డౌన్ సడలింపులు.. మళ్ళీ ‘జీవం పోసుకోనున్న’ 15 పరిశ్రమలు

| Edited By: Anil kumar poka

Apr 13, 2020 | 12:41 PM

21 రోజుల లాక్ డౌన్ మంగళవారంతో ముగుస్తోంది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ ని మరో రెండు వారాలు పొడిగించినప్పటికీ.. ఎకానమీని పునరుధ్దరించే యత్నంలో భాగంగా ప్రభుత్వం 15 పరిశ్రమలను ఈ నిబంధనల నుంచి మినహాయించింది.

లాక్ డౌన్ సడలింపులు.. మళ్ళీ జీవం పోసుకోనున్న 15 పరిశ్రమలు
Follow us on

21 రోజుల లాక్ డౌన్ మంగళవారంతో ముగుస్తోంది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ ని మరో రెండు వారాలు పొడిగించినప్పటికీ.. ఎకానమీని పునరుధ్దరించే యత్నంలో భాగంగా ప్రభుత్వం 15 పరిశ్రమలను ఈ నిబంధనల నుంచి మినహాయించింది. వీటిలో.. ట్రాన్స్ ఫార్మర్లు, సర్క్యూట్ వెహికల్స్, కండెన్సర్ యూనిట్లు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్స్, పవర్ లూమ్స్ వంటివి ఉన్నాయి. డిఫెన్స్, డిఫెన్స్ యాక్సిలరీ యూనిట్లను కూడా రూల్స్ నుంచి మినహాయించారు. అయితే సింగిల్  షిఫ్ట్ లో కార్మికులు సామాజిక దూరాన్ని పాటిస్తూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ సిమెంట్ కర్మాగారాలను  మూడు షిఫ్టుల్లోనూ పని చేసేందుకు అనుమతించారు. కరోనా కేసులు తక్కువగా ఉన్న చోట్ల కాగితం, కాగితం గుజ్జు కర్మాగారాలు మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. అలాగే లాక్ డౌన్ నుంచి ఎరువుల ఫ్యాక్టరీలను, అన్ని రకాల ఫుడ్, బెవరేజీలను కూడా మినహాయించారు. కార్మికులకు  శానిటైజేషన్ తప్పనిసరి.