Covid 4th Wave: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో మంగళవారం దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid 4th Wave: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona

Updated on: Aug 11, 2022 | 9:58 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. మంగళవారం కన్నా.. బుధవారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో మంగళవారం దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,25,076 (0.28 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.58 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,42,06,996 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,879 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 19,431 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,35,55,041 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 207.29 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • దేశంలో నిన్న 25,75,389 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

ఢిల్లీలో అత్యధికంగా..

ఢిల్లీలో అత్యధికంగా 2,146 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,847, కర్ణాటకలో 1,680, హర్యానాలో 1145, కేరళలో 1317 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..