India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిస్తున్నాయి. శనివారంతో పోల్చుకుంటే.. ఆదివారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,451 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 266 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న నమోదైన గణాంకాల్లో కేరళలో 7124 కేసులు నమోదు కాగా.. 7488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 21 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో 1,42,826 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 262 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.24 శాతం ఉన్నట్లు పేర్కొంది.
తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,66,987 కి చేరగా.. మరణాల సంఖ్య 4,61,057 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న కరోనా నుంచి 13,204 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,63,104 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.
India reports 11,451 new #COVID19 cases, 13,204 recoveries & 266 deaths in last 24 hours
Active caseload stands at 1,42,826 – lowest in 262 days. Recovery Rate currently at 98.24% – highest since March 2020. Active cases account for 0.42% of total cases – lowest since March 2020 pic.twitter.com/p8KcDHFzxb
— ANI (@ANI) November 8, 2021
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,08,47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 8,70,058 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 61,60,71,949 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
Also Read: