India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు దేశవాసులను ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,853 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 526 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 260 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98.24 శాతానికి పైగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది
తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,55,536 కి చేరగా.. మరణాల సంఖ్య 4,60,791 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న కరోనా నుంచి 12,432 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,49,900 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,08,21,66,365 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
COVID19 | India reports 10,853 new cases, 526 deaths and 12,432 recoveries in the last 24 hours; Active caseload at 1,44,845
Total vaccination: 1,08,21,66,365 pic.twitter.com/AyCgodvACu
— ANI (@ANI) November 7, 2021
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/Xwj42usLgv
— ICMR (@ICMRDELHI) November 7, 2021
Army Man Dies: ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు.. ఎముకలు కొరికే చలి.. దేశ సరిహద్దులో అమరుడైన వీర జవాన్