India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. 527 రోజుల కనిష్టానికి చేరిక..

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిన

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. 527 రోజుల కనిష్టానికి చేరిక..
India Corona

Updated on: Nov 17, 2021 | 9:49 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,197 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 301 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 527 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది. 44 రోజుల తర్వాత గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,66,598 కి చేరగా.. మరణాల సంఖ్య 4,64,153 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,134 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3.38,73,890 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read:

Kartarpur Sahib Corridor: నేటినుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునఃప్రారంభం.. కోవిడ్ ప్రొటోకాల్స్‌తో పవిత్ర దర్శనం..

CRPF Jawan Arrest: మావోలకు మందుగుండు సామగ్రి సరఫరా.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ముగ్గురి అరెస్ట్..