India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. యాక్టివ్‌గా ఎన్ని ఉన్నాయంటే..?

|

Nov 09, 2021 | 9:46 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. యాక్టివ్‌గా ఎన్ని ఉన్నాయంటే..?
India Corona
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిస్తున్నాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,126 కేసులు నమోదయ్యాయి. 266 రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 332 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,40,638 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 263 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,77,113 కి చేరగా.. మరణాల సంఖ్య 4,61,389 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న కరోనా నుంచి 11,982 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,75,086 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.25 శాతం ఉంది. మార్చి తర్వాత రికవరీ రేటు భారీగా పెరిగింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,09,08,16,356 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న దేశవ్యాప్తంగా 59,08,440 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

Also Read:

Crime News: దారుణం.. స్నేహితుడి భార్యపై అత్యాచారం.. వీడియోలు తీసి నరకం చూపించిన దుర్మార్గుడు..

Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి