Covid-19 Delta Plus Variant: మహారాష్ట్రలో కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. నిన్న ఒకరు డెల్టా ప్లస్ వేరియంట్‌తో మరణించగా.. తాజాగా మరొకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. వీరిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్‌తో మూడు మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం ముంబైలో నగరంలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఓ 63 ఏళ్ల మహిళ మరణించగా.. శుక్రవారం రాయగడ్ జిల్లాలో 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
కాగా.. ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27వతేదీన డెల్టా ప్లస్ వేరియంట్‌కు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా వైరస్ సోకిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే.. మహిళ కుటుంబంలోని ఆరుగురు కుటుంబసభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారని.. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.
శుక్రవారం డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రాయగఢ్ జిల్లాలోని నాగోథనే ప్రాంతంలో 69 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు రాయగఢ్ కలెక్టర్ నిధి చౌదరి పేర్కొన్నారు. కాగా.. మహారాష్ట్రలో మొదటగా.. రత్నగిరి జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు డెల్టా ప్లస్ వేరియంట్‌కు గురై మరణించింది. ఇప్పటివరకు కరోనాలోని డెల్టా బారిన పడి ముగ్గురు మరణించారు. ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో మొత్తం 65 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబై నగరంలోని 11 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.
Also Read: