Covaxin phase 4: కోవాగ్జిన్ వ్యాక్సిన్ 4 దశ ట్రయల్ కి సిద్ధపడిన భారత్ బయోటెక్ కంపెనీ.. త్వరలో మూడో ట్రయల్ ఫలితాల ప్రకటన..

| Edited By: Phani CH

Jun 10, 2021 | 10:49 AM

తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ 4 వ దశ ట్రయల్ ని నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థ సిద్ద పడింది. మా వ్యాక్సిన్ నాణ్యత, సామర్త్యాన్ని మరింతగా నిర్ధారించడానికి,

Covaxin phase 4: కోవాగ్జిన్  వ్యాక్సిన్ 4 దశ ట్రయల్ కి సిద్ధపడిన భారత్ బయోటెక్ కంపెనీ..  త్వరలో మూడో  ట్రయల్ ఫలితాల ప్రకటన..
Covaxin
Follow us on

తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ 4 వ దశ ట్రయల్ ని నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థ సిద్ద పడింది. మా వ్యాక్సిన్ నాణ్యత, సామర్త్యాన్ని మరింతగా నిర్ధారించడానికి, పెంచడానికి మేమీ నిర్ణయం తీసుకున్నామని ఈ సంస్థ తెలిపింది. ఇక 3 వ దశ ఫలితాలను సాధ్యమైనంత త్వరలో.. వచ్చే నెలలో ప్రచురిస్తామని పేర్కొంది. ఆ తరువాత పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తామని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోని రాచెస్ ఎల్లా..కోల్ కతాకు చెందిన అశ్వదేశ్ కుమార్ సింగ్ అనే రీసెర్చర్ మధ్య రేగిన ట్విటర్ వివాదం నేపథ్యంలో భారత్ బయోటెక్ ఈ నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ -కోవీషీల్డ్ వ్యాక్సిన్లలో ఏది మంచిది అన్నదానిపై శాస్త్రజ్ఞుల్లో తీవ్ర అయోమయం నెలకొని చర్చల మీద చర్చలు సాగుతున్నాయి. వీటిలో ఏది ఉత్తమ సామర్థ్యం గలదన్నదానిపై ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. అయితే ఇవి రెండూ వేర్వేరు టీకామందులని, వేటికవే మంచి నాణ్యత కలిగినవని కేంద్రం చెబుతోంది. ఇటీవల ఓ అధ్యయనంలో కొవాగ్జిన్ కన్నా కోవిషీల్డ్ ఎక్కువ యాంటీ బాడీలను ప్రొడ్యూస్ చేయగలదని ఓ అధ్యయనంలో వెల్లడైంది/.

అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కావలసి ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ 4 వ దశ క్లినికల్ కి కూడా రెడీ అని ప్రకటించుకుంది. మధ్యప్రదేశ్ లో సుమారు 880 మంది హెల్త్ కేర్ వర్కర్లకు ఈ రెండు రకాల వ్యాక్సిన్లను ఇచ్చిన విషయం గమనార్హం. అయితే ఈ టెస్టులు మరిన్ని నిర్వహించాల్సి ఉందని అక్కడి నిపుణులు అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Shani Jayanti 2021: శనీశ్వరుడిని జయంతిరోజున చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు ఏమిటంటే

Bihar Health Department: 5500 కాదు.. 9000.. కరోనా మరణాల సంఖ్యను సవరించిన ఆ రాష్ట్రం……