MLC Kavitha: ఈడీ కస్టడికి ఎమ్మెల్సీ కవిత.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

|

Mar 16, 2024 | 7:26 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురు అయింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఏడు రోజుల రిమాండ్ విధించింది. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

MLC Kavitha: ఈడీ కస్టడికి ఎమ్మెల్సీ కవిత.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
MLC Kavitha
Follow us on

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ కవితకు కోర్టులో చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఏడు రోజుల రిమాండ్‌ను విధించింది. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న కవితను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ సంస్థ అంతకుముందే కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఇక వారం కస్టడీ అనంతరం కవితను ఈ నెల 23న తిరిగి తమ ఎదుట హాజరుపర్చాలని ఈడీ అధికారులను ఆదేశించారు న్యాయమూర్తి నాగ్‌పాల్. మరోవైపు కవితకు ఏడు రోజులు ఈడీ కస్టడీని విధించిన కోర్టు.. ఆమెకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రతీ రోజూ కుటుంబసభ్యులను, లాయర్లను కలిసేందుకు అనుమతివ్వడంతో పాటు.. ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కూడా అనుమతినిచ్చింది. అలాగే కవితకు డైలీ మెడికల్ టెస్టులు చేయించాలని ఈడీ అధికారులను ఆదేశించింది న్యాయస్థానం.

రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు..

ఎమ్మెల్సీ కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలకాంశాలు పొందుపర్చినట్టు తెలుస్తోంది. ‘లిక్కర్ కేసులోని కీలక సూత్రధారుల్లో కవిత ఒకరు.. మాగుంట రాఘవ, శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డితో కలిసి ఆమె సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు. ఆప్ నేతలతో కుమ్మక్కై సుమారు రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చి.. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. లిక్కర్ సిండికేట్ అంతటిని కవిత తెర వెనుక నడిపారు. ఇండో స్పిరిట్ కంపెనీలో వాటా గల అరుణ్ పిళ్ళై కవితకు బినామీగా ఉన్నారు. సాక్ష్యాలు బయటకు రాకుండా ఫోన్లు, పలు డాక్యుమెంట్స్ ఎమ్మెల్సీ కవిత ధ్వంసం చేశారు. డేటా రికవరీ కోసం ఆమె 10 ఫోన్లు ల్యాబ్‌కు పంపితే 4 మొబైల్స్ డేటా రికవరీ కాలేదన్నారు. తమ విచారణలోనూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతోనే అరెస్ట్ చేశాం’ అని ఈడీ పేర్కొంది.

విచారణలో ఏం చెప్పనున్నారు..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు కస్టడీ విధించడంతో ఈడీ ఆమెను విచారించనుంది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ఆరా తీయనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో ఆమెకున్న సంబంధాలపై ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్తారా.? లేదా.? అనేది చూడాలి.