
గ్యాస్ గీజర్ వాడటం కారణంగా బాత్రూంలో ఆక్సిజన్ శాతం తగ్గి.. ఇద్దరు భార్యభర్తలు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని కొత్వాలి ప్రాంతంలోని గురుకుల్ పురం కాలనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హర్జిందర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రేణుకతో కలిసి స్థానికంగా అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే ఆదివారం హర్జిందర్ సింగ్ తన బట్టలను ఇంటిపై ఆరేశాడు. రాత్రి వరకు బట్టలు అక్కడే ఉండటంతో, ఇంటి యజమాని అన్షు జోషి అతనికి ఫోన్ చేసింది. కానీ హర్జిందర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను రేణుకకు కాల్ చేశాడు. ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఇద్దరూ కాల్ పికప్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి ఓనర్.. హర్జిందర్ ఇంట్లోకి వచ్చి చూశాడు. కానీ ఇంట్లో అతనికి ఎవరూ కనిపించలేదు.అయితే అదే సమయంలో బాత్‌రూమ్‌లోంచి గ్యాస్ లీక్ అవుతున్న శబ్ధాన్ని అతను గమనించాడు. వెంటనే అక్కడకి వెళ్లాడు బాత్‌రూమ్ ఓపెన్ చేద్దామంటే.. అది లోపలి నుంచి గడియపెట్టి ఉండడం గమనించాడు. దీంతో హర్జిందర్ లోపేలే ఉన్నాడని మనించి..డోర్‌ను బద్దల కొట్టి లోపలికి వెళ్లాడు.. ఇంకేముంది.. బాత్‌రూమ్‌లో భార్యభర్తలు ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. అది చూసి జోషి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని బాత్‌రూమ్‌లోని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పుడు రేణుక నగ్నంగా ఉన్నట్టు.. కేవలం హర్జిందర్ మాత్రమే బట్టలు ధరించి ఉన్నట్టు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమెదు చేసుకున్న కొత్వాలి ఇన్‌స్పెక్టర్ సత్యేంద్ర సింగ్ ప్రకరాం.. బాత్‌రూమ్‌లో ఉన్న గ్యాస్ గీజర్ కారణంగానే వాళ్లు చనిపోయి ఉంటాచని అనుమానం వ్యక్తం చేశాడు. ఎందుకంటే.. బాత్‌రూమ్‌కు ఎలాంటి కిటికీలు లేవు.. ఆ సందర్భంగా గీజర్ నుంచి లీకైన గ్యాస్ కారణంగా బాత్‌రూమ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఉంటాయని.. అందుకే ఊపిరి ఆడక ఇద్దరూ మరణించి ఉంటారని ఆయన తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పుకొచ్చారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.