AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడు చెప్పాడంటూ భార్యకు విడాకులిచ్చిన భర్త..! వింత కారణం విని షాక్ తిన్న కోర్టు… ట్విస్ట్‌ ఏంటంటే..!

భార్యాభర్తల మధ్య విడాకులకు సెక్స్, ఆస్తి, అనైతిక సంబంధం, వరకట్న వేధింపులు, దాడి, విడిపోవడానికి ఇలా అనేక కారణాలున్నాయి. అయితే, దేవుడు చెప్పాడని తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఎందుకు ప్రతిపాదించాడో కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

దేవుడు చెప్పాడంటూ భార్యకు విడాకులిచ్చిన భర్త..! వింత కారణం విని షాక్ తిన్న కోర్టు...  ట్విస్ట్‌ ఏంటంటే..!
Divorce
Jyothi Gadda
|

Updated on: Feb 02, 2023 | 11:04 AM

Share

దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల కసరత్తులు చేసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. దేవుడి మీదున్న నమ్మకంతో కొందరు చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. గతంలో బళ్లారికి చెందిన ఒక యువకుడు దేవుడు చెప్పాడంటూ తన నాలుక కోసి దేవుడికి సమర్పించుకున్నాడు. తాజాగా మరో వ్యక్తి దేవుడు చెప్పాడంటూ సజావుగా సాగుతున్న కాపురంలో చిచ్చు రగిల్చాడు. ప్రమగా ఉంటున్న తన భార్యకు విడాకులిచ్చాడు. అయితే ఈ విడాకుల కేసు కోర్టులో విచారణకు రాగా.. న్యాయమూర్తి విచిత్రమైన కారణం విని ఆశ్చర్యపోయారు. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హందనకెరె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దేవుడు చెప్పాడని భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. భార్యాభర్తల మధ్య విడాకులకు సెక్స్, ఆస్తి, అనైతిక సంబంధం, వరకట్న వేధింపులు, దాడి, విడిపోవడానికి ఇలా అనేక కారణాలున్నాయి. అయితే, దేవుడు చెప్పాడని తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఎందుకు ప్రతిపాదించాడో కారణాన్ని అడిగిన తర్వాత న్యాయమూర్తి పిటిషనర్‌ను మందలించారు.

తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లిలో ఘటన జరిగింది. చిక్కనాయకనహళ్లి తాలూకా హందనకెరెలో మంజునాథ్‌, పార్వతమ్మలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరూ జంటగా సామరస్య జీవితాన్ని గడుపుతున్నారు. అయితే దేవుడి మాట విని భర్త మంజునాథ్ మూఢనమ్మకంతో భార్యకు విడాకులు ఇవ్వాలని కోర్టుకు వెళ్లాడు. చిక్కనాయకనహళ్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.చిక్కనాయకనహళ్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశప్ప వాదనను పూర్తిగా వినిపించారు.

Divorce1

ఇవి కూడా చదవండి

దంపతులు ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దేవుడి మాట వినేందుకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని మంజునాథ్‌ వివరించాడు. ఈ మేరకు తనకు పతిరయ్య సలహా ఇచ్చినట్టుగా వెల్లడించాడు. దీంతో కోర్టు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చింది. ఆఖరుకు న్యాయమూర్తి మాటలు విని భార్యతో కలిసి జీవించేందుకు మంజునాథ్ అంగీకరించాడు. అనంతరం న్యాయమూర్తి దంపతులు కోర్టులో దండలు మార్చుకుని కలిసి జీవించాలని ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..