ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలో విపరీత ప్రాణ నష్టం, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్, ‘ఎవరు బాధ్యులు’ అంటూ ఫేస్ బుక్ ‘ఉద్యమం’ !

| Edited By: Phani CH

May 25, 2021 | 8:32 PM

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ కోవిద్ సంక్షోభంలో అసంఖ్యాకంగా మరణాలు సంభవించాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు.

ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలో విపరీత ప్రాణ నష్టం, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్, ఎవరు బాధ్యులు అంటూ ఫేస్ బుక్ ఉద్యమం !
Priyanka Gandhi
Follow us on

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ కోవిద్ సంక్షోభంలో అసంఖ్యాకంగా మరణాలు సంభవించాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇందుకు ఈ బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఫేస్ బుక్ ద్వారా ఆమె..’జుమ్మేదార్ కౌన్’ (ఎవరు బాధ్యులు) అనే పేరిట ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఈ సెకండ్ కోవిద్ వేవ్ లో ప్రజలు ఆక్సిజన్ , బెడ్స్, వాక్సిన్, మందులు లేక అల్లాడిపోయారని, వీటిని ప్రభుత్వం మౌనంగా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించిందని అన్నారు. దేశంలో ఇంతటి దారుణ పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు. వ్యాక్సినేషన్ లో జాప్యం, విదేశీ సాయాన్ని త్వరితగతిన వినియోగించడంలో అలసత్వం వంటివి పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయని ఆమె పేర్కొన్నారు.ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటైన ఇండియా ఇప్పుడు ఈ కొరతను ఎదుర్కోవడానికి ఎవరు బాధ్యత వహించాలన్నారు. అలాగే అపారమైన మేధా సంపత్తి గల వైద్య సిబ్బంది ఉన్న ఈ దేశంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించే రోజులు రావాలని ఆమె కోరారు. కోవిద్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో బీజేపీ నేతలు మళ్ళీ మీడియా ముందు కనబడుతున్నారని ఆమె మండిపడ్డారు.

ఇప్పటికైనా విదేశాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె సూచించారు. వ్యాక్సిన్ కొరత ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: బీజేపీని ఎదుర్కొనేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపరు ? సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి

Mars Rover: అంగారక గ్రహంపై ఉప్పు.. మరో ఆసక్తికర ఫోటో రిలీజ్ చేసిన నాసా రోవర్… ( వీడియో )