India Coronavirus: మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. 30 వేల మార్కును దాటేసింది.. ఇందులో సగానికి పైగా ఆ రాష్ట్రంలోనే..

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లే తగ్గి పేరుగుతున్నాయి. ఈ రోజు మాత్రం 30 వేల మార్కును దాటేసింది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం..

India Coronavirus: మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. 30 వేల మార్కును దాటేసింది.. ఇందులో సగానికి పైగా ఆ రాష్ట్రంలోనే..
Telangana Corona

Edited By:

Updated on: Sep 16, 2021 | 2:36 PM

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లే తగ్గి పేరుగుతున్నాయి. ఈ రోజు మాత్రం 30 వేల మార్కును దాటేసింది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిందని అంతా అనుకుని సంబర పడిపోయినంతలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 30,570 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 431 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదిలావుంటే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 17,681 కరోనా కేసులు నమోదు కాగా.. 208 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,17,325 కి పెరగగా.. మరణాల సంఖ్య4,43,923 చేరింది. నిన్న కరోనా నుంచి 38,3036 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,25,60,474 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,42,923 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 76,57,17,137 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 64,51,423 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..