భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నప్పటికీ.. ఈ రోజు మాత్రం కొద్దిగా పెరిగాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో బుధవారం కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 27,176 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 284 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదిలావుంటే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 15,876 కరోనా కేసులు నమోదు కాగా.. 129 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755 కి పెరగగా.. మరణాల సంఖ్య4,43,497 చేరింది. నిన్న కరోనా నుంచి 38,012 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,25,22,171 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,51,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,89,12,277 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 61,15,690 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
India reports 27,176 new #COVID19 cases, 38,012 recoveries, and 284 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 3,33,16,755
Active cases: 3,51,087
Total recoveries: 3,25,22,171
Death toll: 4,43,497Total Vaccination: 75,89,12,277 (61,15,690 in last 24 hrs) pic.twitter.com/6XmpGDSLYf
— ANI (@ANI) September 15, 2021
ఇవి కూడా చదవండి: Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..