Corona Virus: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సింది లేదన్న వైరాలజిస్ట్

|

Mar 09, 2022 | 9:23 AM

Corona Virus: భారత దేశం(Inida)లో గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటూ.. మానవజాతిని వణికిస్తూనే ఉంది. సెకండ్ వేవ్(Second Wave) లో డెల్టా వేరియంట్(Delta Variant), థర్డ్ వేవ్ లో

Corona Virus: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సింది లేదన్న వైరాలజిస్ట్
No Fourth Wave
Follow us on

Corona Virus: భారత దేశం(Inida)లో గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటూ..  మానవజాతిని వణికిస్తూనే ఉంది. సెకండ్ వేవ్(Second Wave) లో డెల్టా వేరియంట్(Delta Variant),  థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్(Omicron) తో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ నుంచి బయటపడుతూ.. జనం సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఫోర్త్ వేవ్ వస్తుందేమోనని భయపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టి.జాకోబ్‌ జాన్‌ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో కొవిడ్‌-19 నాలుగో వేవ్‌ ఉండకపోవచ్చని అన్నారు.  భారత వైద్య పరిశోధన మండలి (icmr )కి చెందిన వైరాలజీ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ టి జాకబ్ జాన్  ‘పీటీఐ’ వార్తాసంస్థతో మాట్లాడుతూ పలు కీలకాంశాలను వెల్లడించారు. భారతదేశంలో కోవిడ్  థర్డ్ వేవ్ ముగిసిందని.. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప దేశంలో నాల్గవ వేవ్ ఏర్పడదని పేర్కొన్నారు. దేశం మరోసారి కరోనా స్థానిక దశలోకి ప్రవేశించిందని దీంతో నాల్గవ వేవ్ ముప్పు లేదని  డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు.

కొవిడ్‌ మరోసారి ఎండెమిక్‌ దశకు చేరిందని స్పష్టం చేశారు. అంతేకాదు ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్‌ రకాలకు భిన్నంగా వ్యవహరించే వేరియంట్‌ ఏదైనా పుట్టుకొస్తే తప్ప నాలుగో వేవ్‌ దేశంలో రాదని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో  మంగళవారం రోజున  3,993 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి 662 రోజులలో కనిష్టమైనది. గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్‌ఫ్లుఎంజా కారణంగానే జరిగాయని..  ప్రతి ఇన్‌ఫ్లుఎంజా మహమ్మారి సెకండ్ లేదా థర్డ్ వేవ్ తో ముగిసిందని డాక్టర్ జాన్ చెప్పారు.

Also Read:

ఏపీలో కొండెక్కిన కోడి ధరలు… కిలో రూ.300.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వ్యాపారస్తులు