India Corona: దేశంలో గణనీయంగా తగ్గిన కోవిడ్.. 4 వేల దిగువకు కేసులు నమోదు.. తగ్గుతున్న మరణాలు

|

Mar 07, 2022 | 11:18 AM

India Corona: గత కొన్ని నెలల క్రితం థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ ఓ రేంజ్ లో వ్యాపించి.. ప్రజలను ఓ రేంజ్ లో భయబ్రాంతులకు గురి చేసింది. అయితే కొన్ని రోజుల నుంచి కోవిడ్ కొత్త కేసులు నమోదు.. క్రమేపీ తగ్గుముఖం..

India Corona: దేశంలో గణనీయంగా తగ్గిన కోవిడ్.. 4 వేల దిగువకు కేసులు నమోదు.. తగ్గుతున్న మరణాలు
Coronavirus In India
Follow us on

India Corona: గత కొన్ని నెలల క్రితం థర్డ్ వేవ్ (Third Wave)లో కరోనా వైరస్(Corona Virus) ఓ రేంజ్ లో వ్యాపించి.. ప్రజలను ఓ రేంజ్ లో భయబ్రాంతులకు గురి చేసింది. అయితే కొన్ని రోజుల నుంచి కోవిడ్(Covid-19) కొత్త కేసులు నమోదు.. క్రమేపీ తగ్గుముఖం పడుతూ.. రిలీఫ్ ఇస్తున్నాయి. అవును దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖంపట్టడంతో యాక్టివ్‌ కేసులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4,362 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసులు  4,29,67,315 లకు చేరుకున్నాయి.  మరోవైపు గత 24 గంటల్లో 66 మంది మృతి చెందినట్లు సోమవారం కేంద్రం ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో  కరోనా బారిన పడి  దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య  5,15,102 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4,23,98,095 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 54,118 కేసులు యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా థర్డ్ వేవ్ కు కారణమైన ఒమిక్రాన్ ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో కొత్త కేసుల నమోదు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుండడంతో ఊరట కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగింది. గత 24వంటల్లో 9,620 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. మరోవైపు దేశంలో 178 కోట్ల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది.

Also Read:

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తుకు నేడే ఆఖరు..