దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పాండమిక్ అదుపునకు కోవిడ్-19 ప్రొటొకాల్స్ ను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఇప్పటికీ చెబుతున్నా,, ఈ వైరస్ ని నిర్లక్ష్యం చేయకండి.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటింపు వంటివాటిని పాటిస్తూ మిమ్మల్ని మీరే కాక, ఇతరులను కూడా అప్రమత్తులను చేయండి అని ఆయన హితవు చెప్పారు. మహారాష్ట్రలో డా.బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆటోబయాగ్రఫీని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ‘జబ్ తక్ దవాయీ నహీ. తబ్ తక్ దిలాయీ నహీ’ (మందులు లేనంతవరకు ఊరట ఉండదు) అని మోదీ అన్నారు. బాలాసాహెబ్ విఖే పాటిల్ మహోన్నత గుణాలను ఆయన ప్రస్తావించారు.