Corona Case: కోటి పరిహారం ఇప్పించండి.. కరోనాతో మరణించిన మొదటి పోలీస్‌ భార్య కోర్టును ఆశ్రయించింది..

|

Dec 16, 2022 | 3:45 PM

ఈ కేసును జస్టిస్ ప్రతిభా సింగ్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారించింది. చనిపోయిన కానిస్టేబుల్ పేరు అమిత్ కుమార్. ఆయన భార్య పూజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Corona Case: కోటి పరిహారం ఇప్పించండి.. కరోనాతో మరణించిన మొదటి పోలీస్‌ భార్య కోర్టును ఆశ్రయించింది..
Corona Cases in China
Follow us on

కరోనా మొదటి వేవ్‌లో దేశంలో వేలాది మంది మరణించారు. వైరస్‌ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందున్న కారణంగా ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. ప్రజలను ఇళ్లల్లో బంధించారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీస్‌ శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్ కూడా కరోనాతో మరణించాడు. ఇప్పుడు అతని భార్య తనకు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనకు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వం బాధితురాలికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించే ప్రకటన నుండి వెనక్కి వెళ్ళలేము అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ కేసును జస్టిస్ ప్రతిభా సింగ్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారించింది. చనిపోయిన కానిస్టేబుల్ పేరు అమిత్ కుమార్. ఆయన భార్య పూజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అమిత్ కుమార్ మే 5, 2020న మరణించారు. దీప్ చంద్ బంధు ఆసుపత్రిలో కోవిడ్‌ విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కరోనాతో మరణించిన మొదటి ఢిల్లీ పోలీసు సిబ్బంది అమిత్ కుమారే. పూజ ఆరోపణల మేరకు.. కరోనాపై యుద్ధంలో ఒక సిబ్బంది చనిపోతే, ఢిల్లీ పోలీసులు అతని కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి పూజా తరఫు న్యాయవాది కూడా కోర్టులో ఆధారాలు సమర్పించారు.

కరోనా సమయంలో ఆ కానిస్టేబుల్‌ డ్యూటీలో లేడని ఢిల్లీ ప్రభుత్వం చెప్పలేదని పూజా న్యాయవాది చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వు కాపీని కూడా న్యాయవాది కోర్టులో సమర్పించారు. ఈ విపత్తు సమయంలో ప్రతి కార్మికుడు విధిగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో పట్టుబట్టింది. కానిస్టేబుల్ మృతికి సంతాపం తెలిపిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌ను కూడా పూజా తరఫు న్యాయవాది ప్రస్తావించారు. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, ఈ విషయంలో సానుభూతితో కూడిన దృక్పథం అవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరణించిన కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగా కోవిడ్-19తో మరణించాడనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని డీసీపీ కార్యాలయం కూడా ధృవీకరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి