Corona Virus:గత రెండు రోజులుగా దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒక్క రోజులో.. కొత్త ఇన్ఫెక్షన్ కేసుల్లో సుమారు 9 శాతం పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 4041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్గా ఉన్న రోగుల సంఖ్య కూడా 21177కి పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా 0.95 శాతానికి పెరిగింది. దేశంలోని ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది. కేరళ, మహారాష్ట్రల్లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తిస్తోంది. ఈ రాష్ట్రాల్లో యాక్టివ్ పేషెంట్ల సంఖ్యతో పాటు, కరోనా పాజిటివ్ రేటు కూడా వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 34 శాతం కేరళ నుంచి మాత్రమే నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో.. ఈ పెరుగుతున్న కేసులు మళ్ళీ కోవిడ్ విజృంభణకు సంకేతమా అనే ప్రశ్న తలెత్తుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేరళ, మహారాష్ట్రల్లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే?
కేరళ, మహారాష్ట్రల్లో పెరుగుతున్న కేసులపై వైద్య అధికారులు స్పందిస్తూ.. గతంలో ఇదే విధంగా ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కేరళ, మహారాష్ట్రల్లో పెరుగుతున్నాయని అన్నారు. ఇది భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా కరోనా కేసులు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎండిమిక్ దశలో ఉంది. అంటే డెంగ్యూ, మలేరియా వంటి వైరస్ జ్వరాల మాదిరిగానే మన మధ్యనే ఉండిపోతుంది. అందుకే కరోనాలో వివిధ వేరియంట్స్ వస్తూనే ఉంటాయి.. కొన్ని రాష్ట్రాల్లో, కరోనా కేసులు పెరుగుతాయి మరియు కొంతకాలం తర్వాత తగ్గుతాయి.. అయితే ఎప్పటికీ రెండవ వేవ్ సమయంలో కనిపించిన కరోనా దశ ఎప్పటికీ రాదని.. ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..