Corona India Updates: దేశంలో 60 లక్షలు దాటేసిన కేసుల సంఖ్య

| Edited By:

Sep 28, 2020 | 10:41 AM

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 82,170 కొత్త కేసులు నమోదు అయ్యాయి

Corona India Updates: దేశంలో 60 లక్షలు దాటేసిన కేసుల సంఖ్య
Follow us on

Corona Cases India: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 82,170 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 60, 60,74,703కు చేరింది. ఇక ఈ వ్యాధి బారిన పడి తాజాగా 1,039 మంది కన్నుమూయగా.. మృతుల సంఖ్య 95,542కు చేరింది. ఇక  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50,16,521 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,62,640గా ఉండగా.. వారందరూ వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.  ఇక నిన్న ఒక్క రోజులో 7,09,394  పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 7,19,67,230 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. రోజుకు అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నప్పటికీ, అన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు అధికంగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తోంది.

Read More:

చంద్రబాబు ఇంటికి వరద ప్రమాద హెచ్చరిక

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,378 కొత్త కేసులు.. 7 మరణాలు