India Corona: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఊరట కలిగిస్తున్న గణాంకాలు

|

Mar 28, 2022 | 11:15 AM

దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేలు, పదిహేను వందలు లోపే నమోదైన కేసులు(Corona Cases) నేడు 1200కు చేరాయి. మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం...

India Corona: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఊరట కలిగిస్తున్న గణాంకాలు
Follow us on

దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేలు, పదిహేను వందలు లోపే నమోదైన కేసులు(Corona Cases) నేడు 1200కు చేరాయి. మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం (Decrease) ఊరట కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 4,32,389 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,270 మందికి వైరస్ సోకినట్లు తేలింది. నిన్న 149గా ఉన్న కరోనా మరణాలు నేడు 31కి తగ్గాయి. పలు రాష్ట్రాలు మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో మృతుల(Corona Deaths) సంఖ్యలో వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటివరకూ మహమ్మారి ధాటికి 5.21 లక్షల మంది మృతి చెందారు. ఇక నిన్న 1,567 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది.

మరోవైపు.. దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మార్చి 31 నుంచి కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనావైరస్‌, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్‌- ఆడియో ప్రకటనలు, కాలర్‌ ట్యూన్ల (Covid-19 Caller Tune) ను నిలిపివేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రీకాల్‌-ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్‌ మాట్లాడటం ఆలస్యమవుతోందంటూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ సర్వీసును నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికారవర్గాలు వెల్లడించాయి.

Also Read

Kidney Healthy Foods: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినాలి.. ఏమి తినకూడదో తెలుసా..

మామిడి పొడితో మస్త్‌మస్త్‌ లాభాలు.. ఆయా సమస్యలకు చెక్‌ !!

Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..