Viral: విచారణ కోసం కోర్టుకు ఖైదీలు.. తిరిగి జైలుకు వచ్చేప్పుడు జేబులు చెక్ చేయగా షాక్

|

Aug 04, 2022 | 7:54 PM

వారు తప్పు చేసి జైల్లో చిప్ప కూడు తింటున్నారు. అయినా బుద్ది మారలేదు. తగ్గేదే లేదు అన్నట్లు ప్రవర్తించి.. జైల్లోనే మరోసారి అడ్డంగా బుక్కయ్యారు.

Viral: విచారణ కోసం కోర్టుకు ఖైదీలు.. తిరిగి జైలుకు వచ్చేప్పుడు జేబులు చెక్ చేయగా షాక్
Representative image
Follow us on

Punjab: అతనో పోలీస్ ఆఫీసర్. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తప్పు చేసినవాళ్లను లాకప్‌లో వేసి తోలు తీయాలి. కానీ ఆయనే ట్రాక్ తప్పాడు. అది కూడా జైలులో ఉంటున్న ఖైదీలతో చేతులు కలిపాడు. ఏకంగా జైలు నుంచి విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన ఖైదీలకు డ్రగ్స్ అందజేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జైలు(Faridkot jail)లో ఉన్న ఇద్దరు ఖైదీలను ఒక కేసు విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లారు మోగా పోలీసులు. వారు తిరిగి జైలుకు వచ్చినప్పుడు జైలు ఎంట్రన్స్ వద్ద తనిఖీలు చేయగా జేబుల్లో దాచిన  50 గ్రాముల మత్తు పొడి దొరికింది. దీంతో అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించగా,  కోర్టు విచారణ తర్వాత తిరిగి జైలుకు తిరిగి వస్తుండగా మోగా(Moga) స్టేషన్‌లో పనిచేస్తున్న ASI రాజ్ సింగ్ తమకు బస్సులో డ్రగ్‌ను అందజేసినట్లు ఖైదీలు తెలిపారు. తమ స్నేహితుల్లో ఒకరు ఏఎస్‌ఐకి ప్యాకేజీ ఇవ్వగా.. అతను తమకు అందజేసినట్లు వివరించారు. దీంతో ASI రాజ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు. ఇద్దరు జైలు ఖైదీలు తల్వాండీ భాయ్‌కు చెందిన విక్రమ్ సింగ్, మోగా జిల్లాలోని సమల్‌సర్‌కు చెందిన రావల్ సింగ్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. (Source)