ఒక విచిత్ర ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ట్రక్కు టైర్లు రోడ్డుపై లోతుగా ఇరుక్కుపోయి కనిపించింది. ట్రక్కు టైర్స్ ఎంత దారుణంగా రోడ్డులో కూరుకుపోయాయో చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో అక్కడి రోడ్ల పరిస్థితిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. రోడ్డుపై కూరుకుపోయిన ట్రక్కు ఫోటోలపై స్పందిస్తూ.. ఇంత సుతిమెత్తని రోడ్డు వేసి ఉండాల్సింది కాదంటూ నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. ఈ ఫోటోలు జూన్ 12న సోషల్ మీడియాలో షేర్ చేయగా, విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫోటోలోని దృశ్యం బీహార్‌లోని పాట్నా నగరంలోని అగంకువాన్-శీతల మాత మందిర్ రహదారికి సమీపంలో జరిగింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కంటైనర్ (ట్రక్కు) వెనుక టైర్స్ ఒక్కసారిగా రోడ్డుపై గొయ్యిలో కూరుకుపోయింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రోడ్డు దుస్థితిని చూసి ప్రజలు ఇక్కడి అభివృద్ధిని వర్ణిస్తున్నారు.
బీహార్‌లోని పాట్నాలోని అగంకువాన్-శీతల మాత మందిర్ రహదారికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు వెనుక టైర్స్ గొయ్యిలో కూరుకుపోయింది. పాట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోమవారం వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండవేడిమిలో రోజూ రాకపోకలు సాగించే ప్రజలు ఎండలోనే నడి రోడ్డు మధ్యలో చిక్కుకుపోయారు. శీతల అష్టమి తర్వాత శీతల మాత మందిరానికి వెళ్లే చాలా మంది భక్తులు ఎండ వేడిమిలో నిస్సహాయంగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Patna, Bihar: The rear wheel of a container (truck) passing near Agamkuan-Sheetala Mata Mandir road in Patna City got stuck in a pit due to a road collapse (11.06) pic.twitter.com/zHS9WS4mPS
— ANI (@ANI) June 12, 2023
ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కొందరు యూజర్లు ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి రోడ్లే ప్రమాదాలకు కారణమవుతాయంటూ మరి కొందరు వినియోగదారులు అంటున్నారు. ఇంకొందరు ఇంత మృదువైన రోడ్లు ఉంటే ఎలా అంటూ ఎద్దేవా చేశారు. బీహార్ అంతటా ఇలాంటి రోడ్లే ఉన్నాయంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌కి 2 లక్షల 54 వేలకు పైగా వ్యూస్, 2.5 వేల లైక్‌లు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం