PM Modi: ఈ రెండు దేశాల మధ్య కొత్త వంతెన.. పర్యాటకానికి ఊపిరిపోయనున్న మోదీ..

పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్‌ చేసిన కేంద్రం భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం 40 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా వంతెన నిర్మాణం చేపట్టాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది.

PM Modi: ఈ రెండు దేశాల మధ్య కొత్త వంతెన.. పర్యాటకానికి ఊపిరిపోయనున్న మోదీ..
India Srilanka New Bridge

Updated on: Jan 24, 2024 | 11:30 AM

తమిళనాడు, జనవరి 24: పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్‌ చేసిన కేంద్రం భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం 40 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా వంతెన నిర్మాణం చేపట్టాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉండగా ధనుష్కోడి.. తలైమన్నార్‌- శ్రీలంక పాల్క్‌ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వ ప్లాన్‌. 40వేలకోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. కొత్త వంతెన నిర్మాణంతో రెండు దేశాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే భారత్- శ్రీలంక మధ్య రోడ్డు, రైలు వంతెనలు నిర్మించే ప్రణాళికపై చర్చలు జరిగాయి. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ట్రింకోమలి, కొలంబో ఓడరేవుల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారతదేశం, శ్రీలంక 2022లో అంగీకరించాయి.

భారత్‌-శ్రీలంక మధ్య కొత్తగా వంతెన నిర్మాణంతో పర్యటక రంగమే కాకుండా వ్యాపార- వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊపందుకుంటాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు తాజా ప్రాజెక్ట్‌ మరింత ఉపయోగపడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే తమిళనాడులో పర్యటించారు. ధనుష్కోడిని కూడా సందర్శించారు. కోదండ రామస్వామి ఆలయాన్ని దర్శించి.. పూజలు చేశారు. ధనుష్కోడి సమీపంలో ఉన్న అరిచల్‌ మునైని కూడా సందర్శించారు. తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. రామేశ్వరంలోని అగ్నితీర్థం బీచ్ దగ్గర సముద్రంలో స్నానమాచరించిన ప్రధాని, రామనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు. రామాయణంలో రావణుడి లంకకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత నేపథ్యంలో కేంద్రం తాజాగా చేపట్టబోయే వంతెన నిర్మాణం రామభక్తులకు కూడా పండుగలాంటి వార్తే కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..