“భారతరత్న” కాంగ్రెస్ కుటుంబానికేనా..? సావర్కర్‌ దేశ భక్తుడు కాదా..?

| Edited By:

Oct 17, 2019 | 3:20 AM

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అందుకు కారణం బీజేపీ మెనిఫెస్టో. ఈ సారి కమలదళం మెనిఫెస్టోలో వీరసావర్కర్‌కు భారతరత్నను ప్రతిపాదించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ ప్రతిపాదన సరైంది కాదంటూ కాంగ్రెస్ శ్రేణులు తప్పుబట్టాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్.. కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “భారతరత్న”లన్నీ కేవలం మీ కుటుంబాలకే పరిమితమా అంటూ ప్రశ్నించారు. […]

భారతరత్న కాంగ్రెస్ కుటుంబానికేనా..? సావర్కర్‌ దేశ భక్తుడు కాదా..?
Follow us on

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అందుకు కారణం బీజేపీ మెనిఫెస్టో. ఈ సారి కమలదళం మెనిఫెస్టోలో వీరసావర్కర్‌కు భారతరత్నను ప్రతిపాదించడంపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ ప్రతిపాదన సరైంది కాదంటూ కాంగ్రెస్ శ్రేణులు తప్పుబట్టాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్.. కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “భారతరత్న”లన్నీ కేవలం మీ కుటుంబాలకే పరిమితమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే.. “భారతరత్న” కాంగ్రెస్ కుటుంబ సభ్యులకే రావాలని ఆ పార్టీ కోరుకుంటున్నట్లు ఉందని మండిపడ్డారు.

వీరసావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొనడంపై కాంగ్రెస్‌ ఎందుకు కలత చెందుతోందని.. ‘ఆయన దేశభక్తుడు కాదా? అంటూ ప్రశ్నించారు. అండమాన్ వెళ్లిన సమయంలో ప్రతిసారి ఆయన జైలుజీవితం గడిపిన సెల్‌లో తప్పనిసరిగా కూర్చుంటానని అన్నారు. 11 ఏళ్ల పాటు జైలుజీవితం గడిపి, దేశం నుంచి ఏరోజూ ఏదీ కోరని వ్యక్తి వీరసావర్కర్ అని.. సమాజ సంక్షేమానికి పాటుపడిన జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే వంటి దేశభక్తులకు నిశ్చయంగా భారతరత్న ఇచ్చితీరాలని రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

కాగా, సావర్కర్‌కు భారతరత్న ప్రతిపాదనపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీ హత్య కేసులో సావర్కర్ నిందితుడనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, సాక్ష్యాలు లేకనే ఆయనను విడిచిపెట్టారని రషీద్ ఆరోపించారు. ఇవాళ సావర్కర్‌కు భారతరత్న ఇస్తామంటున్న వారు.. రేపటినాడు గాడ్సే పేరు కూడా ప్రతిపాదిస్తారనే భయం కలుగుతోందన్నారు.