Karnataka New CM: సస్పెన్స్‌కు ఫుల్‌స్టాప్‌.. ఆయనే కర్నాటక ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎం మాత్రం..

కర్నాటకలో చాలా రోజులుగా హల్చల్ చేసిన ముఖ్యమంత్రి ఎవరనేది క్లియర్‌గా మారింది. ఇప్పుడు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా కాంగ్రెస్ రోజును ఖరారు చేసింది.

Karnataka New CM: సస్పెన్స్‌కు ఫుల్‌స్టాప్‌.. ఆయనే కర్నాటక ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎం మాత్రం..
Congress

Updated on: May 18, 2023 | 1:16 PM

దాదాపు వారం రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది.
అంతా ఊహించినట్టుగానే కర్నాటక ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. ఈ నెల 20న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య కేబినెట్‌లో డీకే శివకుమార్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌. కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్‌ వచ్చిందని ఆ పార్టీ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు.

కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్‌ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.

సీఎం పేరు ప్రకటించిన వెంటనే కర్నాటక భవిష్యత్‌, తమ రాష్ట్ర ప్రజల సంక్షేమమే తొలి ప్రాధాన్యత అని కేపీసీసీ  అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, ఆయన కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌కు యాడ్‌ చేశారు.

అయితే మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయటకు వచ్చిన DK అసంతృప్తితో కనిపించారు. సాధారణంగా మీడియాతో సరదాగా మాట్లాడే శివకుమార్‌… ఎంత మంది ప్రశ్నించినా జవాబివ్వలేదు. సీఎం ఎంపిక మీకు సంతోషం కలిగించిందా అని ప్రశ్నకి కూడా స్పందించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం