CongressL: చిత్రగుప్తుడి చిట్టాలా సీనియర్ల స్వీయానుభవాలు..

యమధర్మరాజు దగ్గర ఒకడే చిత్రగుప్తుడు. కానీ వయోవృద్ధ పార్టీలో పాపాల పద్దులు రాసిపెట్టుకునే చిత్రగుప్తులు చాలామందున్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న నాయకులే చిట్టా విప్పుతున్నారు. గుర్తున్నాయా అంటూ ఒక్కో గుట్టూ బయటపెడుతున్నారు. మూడుతరాలతో అనుబంధం ఉన్న నాయకుల వ్యాఖ్యల్ని ఖండించలేక.. అవునని ఒప్పుకోలేక సంకటంలో పడుతోంది. సీనియర్లు నోరుతెరిస్తే ఉలిక్కిపడుతోంది కాంగ్రెస్‌.

CongressL: చిత్రగుప్తుడి చిట్టాలా సీనియర్ల స్వీయానుభవాలు..
Congress Internal Rifts

Updated on: Oct 13, 2025 | 10:17 PM

కడుపులో దాచుకోలేక కక్కేస్తున్నారు. క్యాజువల్‌గా మాట్లాడుతూనే కాంగ్రెస్‌ కొంపముంచుతున్నారు. వెతుక్కోవాల్సిన పన్లేకుండా ప్రత్యర్థులకు అస్త్రాలు అందిస్తున్నారు. కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుందని చెప్పుకునే కాంగ్రెస్‌పార్టీలో సీనియర్లు.. ఇన్నేళ్లూ మనసుపొరల్లో దాచిపెట్టుకున్న పాత విషయాలన్నీ చిత్రగుప్తుడి చిట్టాలా బయటికి తీస్తున్నారు. నాలుగు దశాబ్దాలైపోయింది ఆపరేషన్‌ బ్లూస్టార్‌ జరిగి. అప్పట్లో ఇందిరాగాంధీ చేపట్టిన సైనికచర్యని ఇప్పుడు తప్పుపడుతున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ చిదంబరం. హిమాచల్‌ ప్రదేశ్‌ కసౌలిలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలు కోల్పోయారన్న చిదంబరం.. ఈ విషయంలో ఆమెనే దోషిగా చూపించడం తప్పని చెప్పినా.. ఈ కామెంట్‌ కాంగ్రెస్‌ని డ్యామేజ్‌ చేస్తోంది. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ కంటే ముందు పాకిస్తాన్‌పై యుద్ధం విషయంలో అప్పటి తమ ప్రభుత్వం వెనక్కితగ్గడంపైనా చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఆత్మరక్షణలో పడేశాయి. 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌ వంటి దాడులు చేయాలనుకున్నా వెనక్కితగ్గాల్సి వచ్చిందని చిదంబరం చిట్టా విప్పారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా హెచ్చరికలతో వెనక్కి తగ్గినట్లు చెప్పారు. దీంతో దేశభద్రత విషయంలో కాంగ్రెస్‌ రాజీపడిందన్న విమర్శలు మొదలయ్యాయి. ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్‌ ఆత్మకథలో కాంగ్రెస్‌పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు దివంగత ప్రణబ్‌ముఖర్జీ. అత్యున్నత పదవిలో కొనసాగిన వ్యక్తి స్వానుభవం కావటంతో కాంగ్రెస్‌ నోరెత్తలేకపోయింది. తాను రాష్ట్రపతి అయ్యాక.. కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం కోల్పోయిందన్నారు ప్రణబ్‌. సోనియా పార్టీని నడపడంలో సక్సెస్‌ కాలేకపోయారన్నారు. 2004లో తాను ప్రధాని...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి