Congress Protest: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలపై నేడు కాంగ్రెస్ నిరసన ర్యాలీ, ప్రసంగించనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకులు నేడు రాంలీలా మైదాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుదలపై నిరసన తెలియజేయడానికి 'డిల్లీ చలో' ర్యాలీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు ర్యాలీలో ప్రసంగించనున్నారు.

Congress Protest: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలపై నేడు కాంగ్రెస్ నిరసన ర్యాలీ, ప్రసంగించనున్న రాహుల్ గాంధీ
Congress Rally

Updated on: Sep 04, 2022 | 8:42 AM

Congress Protest: దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నేడు కాంగ్రెస్ ర్యాలీ జరగనుంది . ఉదయం 11 గంటల నుంచి ర్యాలీ జరగనున్న నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో కొన్ని రోడ్లు మూసివేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. నేడు ఏ ఏ ప్రాంతాల్లో రోడ్డు మూసివేయనున్నారో ముందుగానే ప్రభుత్వం ప్రయాణికులకు సమాచారం అందించింది. దీనికి అనుగుణంగా వాహనదారులు ప్రయాణీకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచింది.

ఆదివారం రోడ్డు వేసే ప్రాంతాల వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తూ ఢిల్లీ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ర్యాలీ జరిగే ప్రదేశంలో స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను మోహరిస్తారు.  మైదానం దగ్గర  ఎంట్రీ పాయింట్ల వద్ద మెటల్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్వీట్ చేశారు, “రేపు (ఆదివారం) రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి పిలుపునిచ్చినందున..  వేదిక చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాల రహదారులు మూసివేయబడతాయని పేర్కొన్నారు.

ఈ మార్గాలను నివారించడానికి చిట్కాలు
ఈరోజు బరాఖంబా రోడ్డు నుంచి గురునానక్ చౌక్ వరకు రంజిత్ సింగ్ ఫ్లైఓవర్, వివేకానంద మార్గ్ (రెండు వైపులా), JLN మార్గ్ (ఢిల్లీ గేట్ నుండి గురునానక్ చౌక్), గురునానక్ చౌక్ చుట్టూ కమలా మార్కెట్, చమన్ లాల్ మార్గ్, అజ్మేరీ గేట్ వరకు అసఫ్ DDU- మింటో రోడ్ రెడ్ లైట్ పాయింట్ అలీ రోడ్ , కమ్లా మార్కెట్ వైపు మూసివేయబడతాయి.

ఇవి కూడా చదవండి

ప్రసంగించనున్న రాహుల్ గాంధీ  
కాంగ్రెస్ నాయకులు నేడు రాంలీలా మైదాన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుదలపై నిరసన తెలియజేయడానికి ‘డిల్లీ చలో’ ర్యాలీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు ర్యాలీలో ప్రసంగించనున్నారు. నేడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మత విద్వేషలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను దుర్వినియోగం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్.  రోజు రోజుకీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధింపుతో ప్రజలు ఇబ్బందు ఎదుర్కొంటున్నారని చెప్పారు.  పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా తమ స్వరం మరింత తీవ్రం చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..