Congress President Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ముగిసిన పోలింగ్‌.. పోలింగ్‌లో గాంధీ భవన్‌ సాక్షిగా రచ్చ.. కనిపించని వారి ఓట్లు..

|

Oct 17, 2022 | 5:00 PM

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు.. పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పీసీసీ డెలిగేట్స్‌... ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, ప్రియాంకలతో..

Congress President Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ముగిసిన పోలింగ్‌.. పోలింగ్‌లో గాంధీ భవన్‌ సాక్షిగా రచ్చ.. కనిపించని వారి ఓట్లు..
Congress Presidential Polls
Follow us on

దశాబ్దాల తర్వాత ఆలిండియా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు.. పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పీసీసీ డెలిగేట్స్‌.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, ప్రియాంకలతో పాటు.. అభ్యర్థులు మల్లిఖార్జున కర్గే, శశిథరూర్‌లు ఓటు వేశారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో భాగంగా కర్నాటకలో ఉన్న రాహుల్‌ గాంధీ.. అక్కడే ఓటేశారు. ఆలిండియా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. గాంధీభవన్‌ సాక్షిగా రచ్చరచ్చ జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే సభ్యులకు.. ఏఐసీసీ ప్రత్యేకంగా ఇష్యూ చేసిన కార్డుల్లో గందరగోళమే దీనికి కారణమైంది. కార్డులు ఉన్నా.. లిస్టులో పేరు లేదంటూ.. కొందరు నేతల్ని ఓటింగ్‌ అనుమతించకపోవడం దుమారం రేపింది. ఈ లిస్టులో సీనియర్‌ నేతలు సూచించినవారి పేర్లు ఉండటంతో.. వివాదం పెద్దదైంది.

పార్టీ ఎన్నికల ఆర్గనైజింగ్‌ విభాగం వివరణ ఇవ్వాలంటూ.. అనుచరులతో కలిసి గాంధీ భవన్‌ మెట్లమీదే నిరసనకు దిగారు పొన్నాల, దామోదర రాజనరసింహ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంలో నేతల తీరు. ఎవరి వెర్షన్‌ వారిదే అన్నట్టుగా ఉంది.

అయితే.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో 9,000 మందికి పైగా కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు వేస్తున్నారు. రమేష్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పి చిదంబరం సహా పలువురు ప్రముఖ పార్టీ నేతలు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌.. ఈ ఇద్దరు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తి ఏఐసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో… వేలాది మంది ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 3గంటల సమయానికి 71శాతం పోలింగ్ నమోదైందని పార్టీ వర్గాలు తెలిపాయి.

 మరిన్ని జాతీయ వార్తల కోసం..