AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భలే ఛాన్స్ లే..! ఆరు దశాబ్దాల కల.. విజయ్ ‘చేయూత’తో నెరవేరిన వేళ!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేబినెట్‌లోకి వచ్చింది. ఆరు దశాబ్దాల నుంచి నెలకొన్న నిరీక్షణ ఇప్పట్లో సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ కూడా అనుకోలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా కూడా కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్ కు ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంతకీ అంత సుదీర్ఘమైన గ్యాప్ ఎందుకొచ్చింది..?

భలే ఛాన్స్ లే..! ఆరు దశాబ్దాల కల.. విజయ్ ‘చేయూత’తో నెరవేరిన వేళ!
Cm Vijay, Rahul Gandhi
Ch Murali
| Edited By: |

Updated on: May 21, 2026 | 12:26 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేబినెట్‌లోకి వచ్చింది. ఆరు దశాబ్దాల నుంచి నెలకొన్న నిరీక్షణ ఇప్పట్లో సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ కూడా అనుకోలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా కూడా కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్ కు ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంతకీ అంత సుదీర్ఘమైన గ్యాప్ ఎందుకొచ్చింది..?

తమిళనాడులో అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా కాలం ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పాలించింది. 1967లో ద్రవిడ వాద సిద్ధాంతాలతో ఏర్పాటైన డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కాదు కదా సొంతంగా పోటీ చేసే సాహసం కూడా చేయలేని పరిస్థితి. అయితే డీఎంకే తో కలిసి సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అధికారంలో డీఎంకే కూటమి ఉన్న కూడా మంత్రివర్గంలో పనిచేసే అవకాశం దక్కలేదు. దాదాపు 59 సంవత్సరాల పాటు ఇటు డీఎంకే కాకపోతే అన్నాడీఎంకేతో మిత్రపక్షంగా మెలిగిన తమిళనాడులో కాంగ్రెస్ కు ప్రభుత్వంలో భాగస్వామ్యం మాత్రం దక్కలేదు.

ఆరు దశాబ్దాలలో డీఎంకేతోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ప్రయాణం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న డీఎంకే కేంద్ర మంత్రివర్గంలో మాత్రం పదవులు తీసుకుంది. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. మిత్రపక్షంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీ ద్రవిడ పార్టీలను గట్టిగా మంత్రి పదవులు అడిగే సాహసం కూడా చేయలేకపోయింది. విజయ్ పార్టీ స్థాపించాక కాంగ్రెస్ పార్టీకి అలాగే తమిళ పార్టీలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తనతో కలిసి వచ్చే పార్టీలకు అధికార భాగస్వామి కల్పిస్తామని క్యాబినెట్లో మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు.

అయితే తమిళ పార్టీలు విజయ్ ఆఫర్ ను సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయ ఆఫర్ కు అట్రాక్ట్ అయింది. ఎన్నికలకు ముందే విజయ్ పొత్తు కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చర్చలు జరిపిన అప్పట్లో అది సాధ్యపడలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత నంబర్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ అవసరం ఏర్పడడంతో మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న ముందే విజయ్ ఇచ్చిన ఆఫర్ ఈ విధంగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందగా వారిలో ఇద్దరికీ మంత్రివర్గంలో అధిష్టానం ఆకాశం కల్పించింది. రాజేష్ కుమార్, పి విశ్వనాథన్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.. దీంతో 59 ఏళ్ల తర్వాత అది కూడా విజయ్ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ తమిళనాడు కేబినెట్ లోకి అడుగుపెట్టగలిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us