
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు చేరుకుని స్కీయింగ్‌కు వెళ్లారు. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగిసిన అనంతరం జమ్ముకు చేరుకున్న రాహుల్..రెండ్రోజుల పాటు అక్కడ పర్యటిస్తున్నారు. రెండు వారాల క్రితం శ్రీనగర్‌లో భారత్ జోడో పర్యటనను పూర్తి చేసిన రాహుల్ గాంధీ మరోసారి ఇక్కడ తన ట్రేడ్‌మార్క్ టీ-షర్ట్‌లో కనిపించారు. శ్రీనగర్‌కు 52 కిలోమీటర్ల దూరంలోని గుల్‌మార్గ్ స్కీయింగ్ రిసార్ట్‌కు వెళ్లే క్రమంలో టాంగ్‌మార్గ్‌లో కొద్దిసేపు బస చేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సమాధానం చెప్పకుండా కేవలం పలకరించారు. రాహుల్ గాంధీ కూడా గుల్‌మార్గ్‌లో గొండోలా కేబుల్ కార్‌లో ప్రయాణించి స్కీయింగ్ కోసం అఫర్వాత్ చేరుకున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడ స్కీయింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆయనతో పాటు పోలీసులు కూడా ఉన్నారు.
ఇటీవల భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కూడా రాహుల్ గాంధీ.. ఆయన సోదరి ప్రియాంకతో కలిసి మంచు వర్షంలో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గుల్మార్గ్‌లో మంచు అందాలను వీక్షించేందుకు క్యూ కట్టారు పర్యాటకులు. అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో సెల్పీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పలువురు పర్యాటకులతో కాంగ్రెస్ ఎంపీ సెల్ఫీలు కూడా దిగారు.
రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇక్కడికి చేరుకున్నారని, కాశ్మీర్ లోయలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను వర్గాలు వెల్లడించలేదు.
As a reward, Rahul Ji treating himself to a perfect vacation in Gulmarg after successful #BharatJodoYatra.#RahulGandhi@RahulGandhi pic.twitter.com/DDHCDluwCC
— Farhat Naik (@Farhat_naik_) February 15, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం