Rahul Gandhi Reaction: కేంద్ర బడ్జెట్‌ 2022పై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?

|

Feb 01, 2022 | 4:30 PM

Rahul Gandhi: సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ స్పందించారుే.

Rahul Gandhi Reaction: కేంద్ర బడ్జెట్‌ 2022పై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
Rahul Gandhi
Follow us on

Rahul Gandhi Reaction on Budget 2022: మంగళవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ తన మొదటి స్పందనను వెల్లుబుచ్చారు. ఈ బడ్జెట్‌లో ఏ వర్గానికి ఒరిగేదేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా విని, ప్రసంగం ముగించుకుని పార్లమెంటు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో మీడియా తనతో మాట్లాడాలనుకున్నా.. ఏమీ మాట్లాడకుండా తన కారులో వెళ్లిపోయారు.

ఇది జరిగిన కొద్దిసేపటికే, రాహుల్ గాంధీ 2022 బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ బడ్జెట్ జీరో బడ్జెట్ అని పిలిచారు. జీతభత్యాలు, మధ్యతరగతి పేదలు, యువత, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు ఈ బడ్జెట్‌లో ఏమీ దొరకలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.

పన్నుల వసూళ్ల భారంతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అయితే పన్నుల వసూళ్లే మోడీ ప్రభుత్వానికి పెద్ద అచీవ్‌మెంట్ అని రాహుల్ గాంధీ గతంలో ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. దృక్కోణంలో తేడా ఉంది – వారు తమ సంపదను మాత్రమే చూస్తారు, ప్రజల బాధను కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.


మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ బడ్జెట్ గురించి ట్వీట్ చేస్తూ- ‘ఏడేళ్ల తర్వాత కూడా, రాబోయే 25 ఏళ్లకు తప్పుడు కలలు చూపిస్తున్నారు’ అని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ‘మూడేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఆయన హామీలు నమ్మశక్యంగా లేవని’ అన్నారు.

ఇదిలావుంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతులకు సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రకటనలు చేశారు, 2021-22లో రైతుల రబీ, ఖరీఫ్ పంటలను కాపాడుతూ, రైతుల ఖాతాలలో రూ. 2.37 లక్షల కోట్లు జమ చేశామన్నారు. MSP బదిలీ చేయబడం జరుగుతుందన్నారు. 2021-22లో రైతుల రబీ, ఖరీఫ్ పంటలను కాపాడుతూ రూ.2.37 లక్షల కోట్ల ఎంఎస్‌పీని రైతుల ఖాతాలకు బదిలీ చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.