‘ప్రభుత్వం తప్పించుకుందిగా’ ! వ్యాక్సినేషన్ డెడ్ లైన్ పై ప్రభుత్వ ‘సాగదీత’ ధోరణి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్

| Edited By: Anil kumar poka

Jul 24, 2021 | 12:57 PM

దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై మోదీ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి డెడ్ లైన్ పై వార్తా పత్రికల్లో వచ్చిన వార్తను, నిన్న తాను లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సర్కార్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన..

ప్రభుత్వం తప్పించుకుందిగా ! వ్యాక్సినేషన్ డెడ్ లైన్ పై ప్రభుత్వ సాగదీత ధోరణి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi
Follow us on

దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై మోదీ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి డెడ్ లైన్ పై వార్తా పత్రికల్లో వచ్చిన వార్తను, నిన్న తాను లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సర్కార్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన.. ఇది క్లాసిక్ కేస్ ఆఫ్ మిస్సింగ్ స్పైన్’..(చాకచక్యంగా తప్పుకుంటున్న వైనం) అని ట్వీట్ చేశారు. ‘ప్రజలు వ్యాక్సిన్ కోసం లైన్ లో నిలబడుతున్నారు. కానీ సర్కార్ మాత్రం ‘ నో టైం లైన్ ‘(గడువేదీ లేదు)అంటోంది.. దేశంలో వ్యాక్సిన్లు ఏవీ అని ఆయన ప్రశ్నించారు.ఇండియాలో కోవిడ్ పాండమిక్ నేచర్ దృష్ట్యా వ్యాక్సినేషన్ పూర్తి=చేయడానికి కచ్చితమైన టైం లైన్ అంటూ లేదని ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించింది. అయితే 18 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడినవారికి ఈ ఏడాది డిసెంబరు కల్లా ఇది పూర్తి అవుతుందని భావిస్తున్నామని పేర్కొంది. ఏమైనప్పటికి ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ డ్రైవ్ వేగంగా జరుగుతోందని తెలిపింది.

డిసెంబరు నాటికి వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని గత మే నెలలో మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కానీ నిన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు.. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సమాధానమిస్తూ దీనికి డెడ్ లైన్ అంటూ లేదన్నారు. దేశంలో పాండమిక్ నేచర్ మారుతోందని ఆయన చెప్పారు. ఈ సమాధానంతో రాహుల్, ఇతర విపక్ష సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోల్చుకునే బదులు మొదట మన దేశంలోని పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 అత్యాశకు పోతే అంతే ఉంటది మరి..!ఇన్సూరెన్స్‌ డబ్బు ఆశతో బెంజ్‌ కారు తగులబెట్టిన వ్యక్తి..:Benz car Video.

 యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

 ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.