కరోనా వైరస్ లాక్ డౌన్ తో అంతా ‘బీభత్సం’, రాహుల్ గాంధీ

కరోనా వైరస్ లాక్ డౌన్ల తో  దేశంలో అవ్యవస్థీకృత రంగం నాశనమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  ఇందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ తో అంతా బీభత్సం, రాహుల్ గాంధీ

Edited By:

Updated on: Sep 09, 2020 | 1:20 PM

కరోనా వైరస్ లాక్ డౌన్ల తో  దేశంలో అవ్యవస్థీకృత రంగం నాశనమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  ఇందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. తమ పార్టీ చెబుతున్న న్యాయ్ వంటి సామాజిక పథకాన్ని వెంటనే అమలు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార వర్గాలకు సర్కార్ ఓ ప్యాకేజీని రూపొందించాలని, బడా సంపన్నులైన పదిహేను, ఇరవై మంది వ్యక్తులకు లక్షలాది రూపాయల పన్నును మాఫీ చేసే బదులు దేశంలోని పేదల సంగతిని ఆలోచించాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ కేసుల్లో దేశం రెండో స్థానంలో ఉందన్నారు. లాక్ డౌన్ కరోనా పై కాదు.. పేదల పైనే అని ఆరోపించారు.